BigTV English

Indian Railways: రైల్ లోనే థియేటర్ సెట్ చేసేశారు.. ఎవర్రా మీరంతా ఇంత టాలెండ్ గా ఉన్నారు!

Indian Railways: రైల్ లోనే థియేటర్ సెట్ చేసేశారు.. ఎవర్రా మీరంతా ఇంత టాలెండ్ గా ఉన్నారు!

Big Tv Originals: ఫ్రెండ్స్ అంతా కలిసి జర్నీ చేస్తే ఎంత హంగామా, రచ్చ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది బైక్ ప్రయాణం అయినా, బస్సు ప్రయాణం అయినా, రైలు ప్రయాణం అయినా, ఎంజాయ్ లో ఏమాత్రం లోటు ఉండదు. సరదా ముచ్చట్ల నుంచి చిలిపి కొట్లాటల వరకు మామూలుగా ఉండదు. ఫ్రెండ్స్ తో జర్నీ అంటే జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది. అదో తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అందుకే, కలిసి పని చేసే మిత్రులు వీలు దొరికినప్పుడల్లా వెకేషన్స్ కు ప్లాన్ చేస్తుంటారు.


రైల్‌ లోనే థియేటర్ సెట్

ఇక తాజాగా కొంత మంది మిత్రులు కలిసి రైల్లో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా వాళ్లు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. సాధారణంగా ట్రైన్ జర్నీ చేసే సమయంలో ల్యాప్ టాప్, లేదంటే ట్యాబ్, అదీ కాదంటే సెల్ ఫోన్లలో సినిమాలు చూస్తారు. పాటలు వింటారు. కానీ, ఈ ఫ్రెండ్స్ అంతా కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు. రైలు కోచ్ ను థియేటర్ లా మార్చేశారు.  ప్రయాణం అంతా సినిమాలు చూస్తూ జాలీగా గడిపారు.


థియేటర్ సెట్ ఎలా వేశారంటే?

ట్రైన్ జర్నీ చేసే వారి దగ్గర ల్యాప్ టాప్ తో పాటు చిన్న ప్రొజెక్టర్ కూడా ఉంది. ఇక వాళ్లు ప్రయాణించేది ఏసీ కోచ్ కావడంతో రైల్వే దుప్పట్లు ఉండనే ఉన్నాయి. ఓ దుప్పటి తీసుకుని రైలు కిటికీ వైపు తెరలా మార్చారు. దాని మీద ప్రొజెక్టర్ తో సినిమా వేశారు. చుట్టు పక్కల ఉన్న వాళ్లు కూడా మిత్రులే కావడంతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా చిన్నగా సౌండ్ పెట్టి సినిమా చూస్తూ జర్నీ కొనసాగించారు. పనిలో పనిగా పాన్ కార్న్ కొనుగోలు చేసి తినుకుంటూ అచ్చంగా థియేటర్ ఫీల్ ను ఎంజాయ్ చేశారు. వీరి ఎంజాయ్ మెంట్  అంతటినీ తోటి ప్యాసింజర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Also: పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లి మరీ రీల్స్.. నాగర్ కర్నూల్ కుర్రాళ్ల వెర్రి చేష్టలు!

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అవకాశం లేని చోట కూడా అవకాశాన్ని సృష్టించు కోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు. అసలు ఇలాంటి ఆలోచన రావడమే గొప్పవిషయం అని అభినందిస్తున్నారు. మరికొంత మంది ఇలాంటి పనుల వల్ల పక్కవారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని విమర్శిస్తున్నారు. అయితే, వారు పక్క వారికి ఇబ్బంది కలగకుండా తక్కువ సౌండ్ పెట్టి సినిమా చూస్తున్నారని మరికొంత మంది రిప్లై ఇస్తున్నారు. మొత్తంగా ఈ ఫ్రెండ్స్ అంతా రైల్లో చేసిన ఎంజాయ్ అందరికీ భలే సరదాగా అనిపిస్తోంది. ఈ వీడియో ఇప్పటికే బోలెడు వ్యూస్ దక్కించుకుంది. పలువురు ప్రశంసలు దక్కించుకుంటుంది.

Read Also: చర్లపల్లి సమీప మెట్రో స్టేషన్ ఏమిటీ? అక్కడ రైలు దిగితే సిటీకి చేరడం ఎలా?

Related News

Viral Video: ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్ ముందు ఫైటింగ్.. చెల్లి-ఆమె ప్రియుడిపై సోదరుడు దాడి, వైరల్ వీడియో

Viral Video: మెట్రో లైన్‌లో జారిపడ్డ ఇనుప రాడ్డు.. నేరుగా ఆటో ప్రయాణికుడి శరీరంలోకి..

Cinnamon Throwing Tradition: 25 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదా? ఆ దేశంలో చెట్టుకు కట్టేసి.. ఆ పొడి చల్లేస్తారు, ఎందుకంటే?

Bacha Bazi Tradition: బచ్చా బాజీ.. పాక్‌ లొ పాపిష్టి ఆచారం.. అబ్బాయిలకు అమ్మాయిల వేషం వేసి అలా చేస్తారట!

Young president: 20 ఏళ్లకే సొంత దేశాన్ని సృష్టించి తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్న యువకుడు, 400 మంది పౌరులు

Finger Cutting Ritual: ఇంట్లో ఎవరైనా చనిపోతే.. వేళ్లు కట్ చేసుకుంటారు, ఆ ఊర్లో ఇదే ఆచారం!

Big Stories

×