BigTV English

Naga Chaitanya: తండ్రి కాబోతున్న స్టార్ హీరో… పాపం వాళ్లని దీంట్లోకి లాగొద్దు బ్రో..!

Naga Chaitanya: తండ్రి కాబోతున్న స్టార్ హీరో… పాపం వాళ్లని దీంట్లోకి లాగొద్దు బ్రో..!

Naga Chaitanya:సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక జంట ప్రేమలో పడింది అంటే.. ఇక ఆ జంట పెళ్లి చేసుకునే వరకూ.. ఆ జంట గురించి రోజుకొక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఆ జంటే గనుక పెళ్లి చేసుకుంటే, ఎప్పుడు తల్లిదండ్రులవుతారు అంటూ మళ్ళీ వాళ్ళు తల్లిదండ్రులు అయ్యేవరకు వార్తలు వైరల్ చేస్తూనే ఉంటారు.ముఖ్యంగా ఆ జంట కాస్త బయట కనిపించకపోయినా.. సినిమాలకు సైన్ చేయకపోయినా.. వదులుగా ఉండే దుస్తులు వేసుకున్నా.. ఇలా ఏం చేసినా సరే తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ రోజుకో వార్త సృష్టిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నిన్నటి నుంచీ ఒక జంట తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ.. రాణా – మిహికా బజాజ్, కార్తికేయ , నాగచైతన్య- శోభిత ధూళిపాల పేర్లు ఎక్కువగా వినిపించాయి.


తల్లిదండ్రులు కాబోతున్న నాగచైతన్య – శోభిత..

ఈ క్రమంలోనే నాగచైతన్య – శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ వార్తలు వినిపించడంతో.. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అటు సమంత (Samantha) ను కూడా అప్పుడే టార్గెట్ చేయడం మొదలుపెట్టారు అక్కినేని అభిమానులు.. త్వరలోనే అక్కినేని ఇంట్లో బుల్లి వారసుడు రాబోతున్నారు అంటూ చాలామంది పలు రకాల కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ జాబితాలో నాగచైతన్య లేనట్లే అని సన్నిహిత వర్గాలు చెప్పినట్లు సమాచారం. నాగచైతన్య – శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు.. దయచేసి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి.. శుభవార్త ఉంటే వెంటనే మీతోనే చెబుదామంటూ ఆయన టీమ్ స్పందించినట్లు సమాచారం. మొత్తానికైతే నాగచైతన్య- శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని తేలిపోయింది.. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


క్లారిటీ ఇదే..

ఇక నాగచైతన్య, శోభిత విషయానికి వస్తే.. నాగచైతన్య తన భార్య సమంత నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తూ.. అటు సినిమాలు, వెబ్ సిరీస్ లపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే తాను నిర్మించిన నటించిన ‘శుభం’ సినిమా మే తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. అటు నాగచైతన్య మాత్రం శోభితను ప్రేమించి మరీ గత ఏడాది నిశ్చితార్థం చేసుకొని, అందరికీ షాక్ ఇచ్చారు. గత ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఈ జంట చాలా అన్యోన్యంగా ముందుకు సాగుతోంది. ఎక్కడ చూసినా ఈ జంటే కనిపిస్తూ ఉండడం గమనార్హం. నాగచైతన్య సినిమాలో విషయానికి వస్తే చివరిగా చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈయన.. ప్రస్తుతం ‘షో యు’ అనే రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారు. అటు శోభిత కూడా తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×