E-Paper
Advertisement

Naga Chaitanya: కమర్షియల్ హిట్ కోసం కుస్తీలు పడుతున్న నాగచైతన్య…

Naga Chaitanya: కమర్షియల్ హిట్ కోసం కుస్తీలు పడుతున్న నాగచైతన్య…
Advertisement
Naga Chaitanya

Naga Chaitanya: అక్కినేని వంశం లో ఈ తరానికి నట వారసుడిగా ఇండస్ట్రీలో రంగ ప్రవేశం చేసిన నాగ చైతన్య మొదటి నుంచి తన కెరియర్ విషయంలో నానా అగచాట్లు పడుతున్నాడు. ఒకప్పుడు అగ్ర హీరోలు అంటే ఏఎన్ఆర్,ఆ తర్వాత జనరేషన్లో నాగార్జున తమ వంతు స్థానాన్ని నిలుపుకోగలిగారు. కానీ అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ సెకండ్ టైరు హీరోలుగా మిగిలారే తప్ప స్టార్ హీరోల స్టేటస్ కి చేరుకోలేకపోతున్నారు. నాగచైతన్య కనీసం అడపాదడపా హిట్ మూవీస్ తో కాస్త ఫామ్ లో ఉన్నాడు ..మరి అఖిల్ పరిస్థితి దారుణంగా తయారయింది.

రీసెంట్గా భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలైన నాగచైతన్య కస్టడీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఈసారి అయినా కమర్షియల్ హిట్ రాకపోతే ఇండస్ట్రీలో కనుమరుగైపోవడం కన్ఫామ్ అని భావించిన నాగచైతన్య ప్రస్తుతం తన రాబోయే చిత్రం కోసం కుస్తీలు పడుతున్నారు. చందు మొండేటి డైరెక్షన్ లో నాగచైతన్య నెక్స్ట్ మూవీ రాబోతుంది.

Advertisement

ఈ చిత్రం రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా చిత్రీకరించబడుతుండట. ఇప్పటివరకు నాగచైతన్య 22 సినిమాలలో హీరోగా నటించాడు కానీ చెప్పుకో దగ్గ హిట్ అతని ఖాతాలో లేకపోవడం అక్కినేని ఫ్యాన్స్ ని ఎంతో నిరాశ పరుస్తోంది. కాబట్టి రాబోయే 23వ చిత్రంలో ఎలాగైనా సాలిడ్ కమర్షియల్ హిట్ కొట్టాలి అని నాగచైతన్య ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నవంబర్ లో మొదలుపెట్టడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం మత్స్యకారుల నేపథ్యంలో తెరకెక్కబోతోందని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి రీసెర్చ్ వర్క్ కోసం శ్రీకాకుళం తో పాటు పరిసర ప్రాంతాలకు డైరెక్టర్ చందూ మొండేటితో పాటు హీరో నాగచైతన్య కూడా వెళ్లారట. ఇందులో నాగచైతన్య సరసన హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది. అయితే చందూ మొండేటి డైరెక్షన్ లో సాయి పల్లవికి ఇది తొలి చిత్రం …కానీ తమాషా అయిన విషయం ఏమిటంటే సాయి పల్లవి
మలయాళంలో నటించిన ‘ప్రేమమ్’ మూవీ ను తెలుగులో నాగ చైతన్య తో రీమేక్ చేసిన డైరెక్టర్ చందూ మొండేటి.
ఇంతక ముందు సాయి పల్లవి.. నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టొరీ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది…మరో పక్క నాగచైతన్య…చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన ప్రేమమ్ నాగ చైతన్యకు మంచి పుష్ అప్ ఇచ్చింది….మరీ ఈ ముగ్గురి క్రేజీ కాంబినేషన్ వల్ల అయిన పాపం చైతు కి సక్సెస్ దక్కుతుందేమో చూద్దాం…

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×