BigTV English

Iron Dome : ఐరన్‌డోమ్‌ను ఛేదించారిలా..

Iron Dome : ఐరన్‌డోమ్‌ను ఛేదించారిలా..
Iron Dome

Iron Dome : ప్రపంచంలోనే అత్యుత్తమమైన గగనతల రక్షణ వ్యవస్థ అది. గాజాతో నిరంతర ఘర్షణల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఆ వ్యవస్థే ఐరన్ డోమ్. రాకెట్-క్షిపణి దాడులు, మోర్టార్లు, ఆర్టిలరీ షెల్స్, అన్‌మ్యాన్డ్ వెహికల్స్‌ను సమర్థంగా అడ్డుకోగలదీ రక్షణ వ్యవస్థ. తమ గగనతంలోకి దూసుకొచ్చే శత్రు మిస్సైళ్లను 70 కిలోమీటర్ల పరిధిలో గుర్తించి.. తక్షణమే పేల్చివేస్తుంది ఐరన్ డోమ్ సిస్టం.


దేశంలో పలు ప్రాంతాల్లో ఈ వ్యవస్థను నెలకొల్పారు. ఇందులో మూడు ప్రధాన విభాగాలు ఉంటాయి. డిటెక్షన్- ట్రాకింగ్ రాడార్, బేటిల్ మేనేజ్‌మెంట్, వెపన్ కంట్రోల్ అండ్ మిస్సైల్ లాంచర్. ఈ లాంచర్ ఎప్పుడూ 20 తామీర్ మిస్సైళ్లతో సిద్ధంగా ఉంటుంది.2011 నుంచి ఇజ్రాయెల్‌ను ఈ ఐరన్ డోమ్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది.

2006లో లెబనాన్ సంఘర్షణ సమయంలో వేల సంఖ్యలో రాకెట్లతో హిజ్బుల్లా విరుచుకుపడింది. వేల సంఖ్యలో ఇజ్రాయెలీలు మరణించారు. దీంతో ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంది. రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ దీనిని రూపొందించింది. ఇప్పటివరకు ఐరన్ డోమ్ 2000 దాడులను సమర్థంగా తిప్పికొట్టగలిగిందని, 90% సక్సెస్ రేట్ సాధించిందని ఆ సంస్థ చెబుతోంది.


ఏదైనా రాకెట్ ఇజ్రాయెల్ వైపు దూసుకొస్తుంటే.. డిటెక్షన్-ట్రాకింగ్ రాడార్ వెంటనే పసిగడుతుంది. అది పయనించే మార్గానికి సంబంధించిన సమాచారాన్ని ఆ వెంటనే వెపన్స్ కంట్రోల్ సిస్టమ్‌కు చేరవేస్తుంది. రాకెట్ వేగాన్ని, దాని ప్రయాణ మార్గాన్ని కచ్చితంగా లెక్కించి.. ఆ దాడిని సమర్థంగా ఎదుర్కొంటుంది. ఒకవేళ రాకెట్ జనావాసాలవైపు, లేదంటే వ్యూహాత్మక ప్రాంతాల వైపు దూసుకొస్తుంటే లాంచర్ నుంచి తామీర్ మిస్సైళ్లు దూసుకెళ్లి.. ఆ రాకెట్‌ను ఆకాశంలోనే ఛేదించేస్తాయి. ఒక బ్యాటరీకి 3 లేదా 4 లాంచర్లను అనుసంధానిస్తారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ వద్ద పది బ్యాటరీలు ఉన్నాయి.

మరి ఇంతటి సురక్షితమైన ఐరన్ డోమ్ వ్యవస్థను ఛేదించి మరీ హమాస్ ఎలా విజయవంతంగా దాడులు చేయగలిగింది? వాస్తవానికి ఐరన్ డోమ్‌లో ఉన్న లోపాలను వెతికే పనిని హమస్ గత కొన్నేళ్లుగా చేస్తోంది. ఎట్టకేలకు ఆ లూప్‌హోల్‌ను పసిగట్టి దాడులకు తెగబడింది. క్షణాల వ్యవధిలో వేల సంఖ్యలో రాకెట్లతో దాడి చేయడమే హమస్ చేసిన కిటుకు. టార్గెట్లను గుర్తించి ఇంటర్‌సెప్ట్ చేసేంత టైం కూడా ఐరన్‌డోమ్‌కు లభించకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ఎత్తుగడను హమస్ అనుసరించింది.

20 నిమిషాల వ్యవధిలో వరుసగా 5 వేల రాకెట్లను సంధించడంతో ఐరన్ డోమ్ వ్యవస్థ‌కు నిజంగానే ఊపిరి ఆడనంత పనైంది. అప్పటికీ మెజారిటీ సంఖ్యలో రాకెట్లను తుత్తునియలు చేయగలిగింది. లేకుంటే ఇంకెంత నష్టం జరిగేదో? 2012లో హమస్‌తో పోరాడినప్పుడు గాజా స్ట్రిప్ నుంచి 400 రాకెట్లను సంధించగా.. 85% రాకెట్లను ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది. 2014 ఘర్షణల్లో 4500 రాకెట్లను రోజుల తరబడి హమస్ ప్రయోగించింది. వాటిలో 800 రాకెట్లను ఇంటర్ సెప్ట్ చేయగా.. 735 రాకెట్లను కూల్చేశారు. ఈ సారి వ్యూహం మార్చి.. స్వల్ప వ్యవధిలోనే ఒకేసారి 5 వేలకు పైగా రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది హమస్.

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×