BigTV English

Naga Chaitanya – Shobhita: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడ ప్లాన్ చేసిన కొత్తజంట.. మరీ ఇలా అయితే ఎలా గురూ..!

Naga Chaitanya – Shobhita: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడ ప్లాన్ చేసిన కొత్తజంట.. మరీ ఇలా అయితే ఎలా గురూ..!

Naga Chaitanya – Shobhita:నాగచైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల (Shobhita dhulipala) లు పెళ్లి జరిగినప్పటి నుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. శోభిత దూళిపాళ్ల ఎప్పుడైతే అక్కినేని ఫ్యామిలీలోకి కోడలిగా అడుగు పెట్టిందో, అప్పటినుండి ఆమె రేంజ్ మరింత పెరిగింది అని చెప్పుకోవచ్చు.అప్పటివరకు అసలు శోభిత దూళిపాళ్ల అంటే ఎవరు అనే స్టేజ్ నుండి ప్రస్తుతం ది గ్రేట్ అక్కినేని ఫ్యామిలీ ఇంటి కోడలు అని చెప్పుకునే స్థాయికి శోభిత ఎదిగింది. అయితే ఒకప్పుడు సినిమాల్లో నటించిన శోభిత దూళిపాళ్లకి ఇప్పటి శోభిత ధూళిపాళ్లకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఈమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా డిఫరెంట్ గా ఉంది. ఇప్పటి ఫొటోస్ అప్పటి ఫొటోస్ పక్క పక్కనే పెట్టి చూస్తే అసలు ఈమె శోభత నేనా అనే అనుమానాలు వ్యక్తమవుతాయి.


న్యూ ఇయర్ ను అలా సెలబ్రేట్ చేసుకోబోతున్న కొత్త జంట..

అయితే అలాంటి శోభిత, నాగచైతన్యతో పెళ్లయ్యాక పూర్తిగా మారిపోయింది. ఇంకాస్త అందంగా మారిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వెకేషన్ లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఈసారి వేడుకలను విదేశాలలో కాకుండా ముంబైలో సెలబ్రేట్ చేసుకోబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయంపై అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే సెలబ్రిటీలందరూ విదేశాలకు వెళ్ళిపోతారు. కానీ వీరు మాత్రం ముంబైకి వెళ్లాలని ప్లాన్ చేసుకోవడంతో అభిమానులు నిట్టూరుస్తున్నారు. కొత్తగా పెళ్లయిన జంట విదేశాలకు వెళ్లకుండా ముంబైలో సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.


డేట్స్ కుదరక ముంబైలోనే..

అసలు విషయంలోకి వెళ్తే.. న్యూ ఇయర్ వేడుకలను ముందుగా విదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకోవాలి అని నాగచైతన్య, శోభిత అనుకున్నప్పటికీ.. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ముంబైలోనే ఈ జంట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రమే ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

సమంతకు దూరంగా.. శోభితాకు దగ్గరగా..

సమంత (Samantha )ఎప్పుడైతే నాగచైతన్య నుండి విడిపోయిందో అప్పటినుండి నాగచైతన్యకి ఎంతోమంది హీరోయిన్ లతో ఎఫైర్ వార్తలు వినిపించాయి. కానీ అవేవీ కూడా అంతగా వైరల్ అవ్వలేదు. కానీ శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య ఎఫైర్ వార్త మాత్రం ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాని కూడా షేక్ చేసింది. వీరిద్దరూ కలిసి అప్పుడప్పుడు వెకేషన్ లకి వెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ల రిలేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.ఇక ఎక్కడికి వెళ్లినా కూడా నాగచైతన్య పై అలాగే శోభిత దూళిపాళ్లపై జనాలు ఓ కన్నేసి ఉంచారు.

పుకార్లు నిజం చేస్తూ పెళ్లి చేసుకున్న జంట..

అలా చాలాసార్లు మీడియాలో శోభిత ధూళిపాళ్ల, నాగ చైతన్య కలిసి వెకేషన్ కి వెళ్ళిన ఫొటోస్ బయటపడ్డాయి. ఇక ఎట్టకేలకు అందరి అనుమానాలకు తెరదింపి ఫైనల్ గా నాగచైతన్య శోభిత ధూళిపాళ్లలు ఆగస్టు 8న ఎంగేజ్మెంట్ చేసుకొని, డిసెంబర్ 4న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక వీరు పెళ్లి కోసం ఎలాంటి ఆర్భాటాలకు వెళ్లకుండా అన్నపూర్ణ స్టూడియోలోనే చాలా సింపుల్ గా అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి జరగడంతోనే వెంటనే నాగార్జున తన కొడుకు కోడల్ని తీసుకొని శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ కి వెళ్లారు. మళ్ళీ బ్యాక్ టు వర్క్ మోడ్ లోకి వెళ్లి పోయారు.అయితే కొత్తజంట కాబట్టి అప్పుడప్పుడు ఎంజాయ్ మెంట్స్ కూడా ఉండాలి.కాబట్టి న్యూ ఇయర్ కోసం నాగచైతన్య – శోభితలు మంచి ప్లాన్లు వేసుకున్నారట.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×