perni jayasudha: రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ మాజీ ఎంపీ పేర్ని నాని సతీమణి జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గోదాములో బియ్యం మాయంపై పూర్తి స్థాయి విచారణ చేసిన అధికారులు మొత్తం 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు కూడా నిర్ధారించారు. అదనంగా మరో రూ.1.79 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే.. ఈ కేసు విషయంలో పేర్నీ జయసుధకు భాకీ ఊరట లభించింది. పేర్ని నాని జయసుధకు మచిలీపపట్నంలో న్యాయస్థానం ముందస్తు బెయల్ మంజూరు చేసింది. ఈమేరకు హైకోర్టు తీర్పు చెప్పింది.
పేర్ని నాని జయసుధ ముందస్తుపై నేడు న్యాయస్థానంలో విచారణ జరిగింది. రేషన్ బియ్యం మాయం ప్రధాన నిందితురాలగా పేర్ని జయసుధ ఉన్న విషయం తెలిసిిందే. జయసుధ తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన గోదాంలో రేషన్ బియ్యం మాయం అవ్వడంపై ఆమెపై కేసు నమోదైంది. అయితే దానికి సంబంధించిన దాదాపు 1.67 కోట్ల రూపాయలను పేర్ని జయసుధ ప్రభుత్వానికి చెల్లించారు. కానీ న్యాయస్థానం మందస్తుబెయిల్ మంజూరు చేస్తూనే విచారణకు సహకరించాలని ఆదేశించింది. మేనేజర్ మానస తేజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: India Post Payments Bank: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో జాబ్స్.. రూ.2లక్షల వరకు జీతం భయ్యా..!
మరోవైపు.. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో జయసుధకు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొదట 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయంటూ రూ.1.67 కోట్ల జరిమానా విధించగా.. ఆ తర్వాత మరిన్ని బస్తాల బియ్యం మాయమైనట్టు అధికారులు నిర్ధారించారు. మొత్తంగా గోడౌన్ నుంచి 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ కేసు వెలుగు చూసిన తర్వాత మాజీ మంత్రి పేర్నినాని కుటుంబం మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.. కొన్నిసార్లు పేర్నినాని కనిపించినా.. ఆయన ఫ్యామిలీ మొత్తం అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది.