E-Paper
Advertisement

Thandel Release Date: ‘తండేల్’ రిలీజ్ డేట్ ఇదే.. సేఫ్ డేట్‌ను అనౌన్స్ చేసిన మేకర్స్..?

Thandel Release Date: ‘తండేల్’ రిలీజ్ డేట్ ఇదే.. సేఫ్ డేట్‌ను అనౌన్స్ చేసిన మేకర్స్..?
Advertisement

Thandel Movie Release Date: సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్‌కు అస్సలు తిరుగులేదు అనిపిస్తుంది. అలాంటి హీరో, హీరోయిన్, డైరెక్టర్ కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న చిత్రమే ‘తండేల్’. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయినప్పటి నుండే దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నాగచైతన్య, సాయి పల్లవిని మరోసారి ఆన్ స్క్రీన్ చూడడం కోసం ఫ్యాన్స్ అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ‘తండేల్’ షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో ఎప్పటికప్పుడు మూవీ గురించి అప్డేట్స్ ఇస్తున్నా కూడా ఇప్పటివరకు దీని విడుదల తేదీని మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇంతలోనే గ్రాండ్‌గా ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసి ‘తండేల్’ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్.

పాజిటివ్ టాక్ చాలు…

Advertisement

ముందుగా ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందని అనౌన్స్ చేశారు. ప్రతి ఏడాది అక్కినేని కుటుంబం నుంచి సినిమా రావడం ఈ మధ్య ఓ అనవాయితిగా మారింది. దాన్ని కొనసాగిస్తూ.. వచ్చే ఏడాది సంక్రాంతికి తండేల్ వస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ మూవీ సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుంది. దీనికి కారణం… రామ్ చరణ్ కోసం నిర్మాత అల్లు అరవింద్ అయి ఉండొచ్చు. లేదా వెంకటేష్ కోసం అక్కినేని నాగ చైతన్య అయి ఉండొచ్చు. తాజాగా ఈ తండేల్ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

వచ్చే ఏడాది 2025 ఫిబ్రవరి 7న‘తండేల్’ విడుదలకు సిద్ధమయ్యింది. సంక్రాంతికి సినిమాల సందడి ముగిసిన తర్వాత ఫిబ్రవరీలో సేఫ్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మామూలుగా జనవరిలో సంక్రాంతి సందర్భంగా ఎంతోమంది స్టార్ హీరోలు, యంగ్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమవుతారు. కానీ ఫిబ్రవరిలో సినిమాల సందడి అంతగా కనిపించదు. అదే సమయంలో ‘తండేల్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే.. మూవీకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా ఇక కలెక్షన్స్ విషయంలో తిరుగు ఉండదని మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ‘తండేల్’ నుండి చాలాకాలంగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్‌లో సందేహం మొదలయ్యింది. ‘తండేల్’ను పక్కన పెట్టేశారా అని చర్చలు కూడా మొదలయ్యాయి.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో ‘సిటాడెల్ హనీ బన్నీ’ స్పెషల్ స్క్రీనింగ్.. యంగ్ హీరోతో సమంత సందడి

అదే దర్శకుడితో…

యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ఇప్పటికే ‘ప్రేమమ్’ అనే సినిమాలో నటించాడు నాగచైతన్య. మలయాళంలో ఇండస్ట్రీ హిట్ సాధించిన ‘ప్రేమమ్’కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. ఆల్రెడీ మలయాళంలో విడుదలయ్యి పెద్ద హిట్ అయ్యింది. భాష అర్థం కాకపోయినా చాలామంది ఈ చిత్రాన్ని మలయాళంలోనే చూశారు. అలాంటి సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే అసలు ప్రేక్షకులు చూస్తారా అని అందరూ సందేహపడినా కూడా దానిని తెలుగు నేటివిటీకి తగినట్టు మార్చి నాగచైతన్యకు గుర్తుండిపోయే హిట్ అందించాడు చందూ మొండేటి. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మరోసారి వీరు ‘తండేల్’ (Thandel)తో చేతులు కలపనున్నారు. ఈ హీరో, డైరెక్టర్ మాత్రమే కాదు.. హీరో, హీరోయిన్ కాంబినేషన్ కూడా సూపర్ హిట్టే.

కెమిస్ట్రీ సూపర్ హిట్…

నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమాలో నటించారు. ఆ మూవీలో వీరి పెయిర్‌కు మంచి మార్కులు పడ్డాయి. వీరి కెమిస్ట్రీనే సినిమాను నిలబెట్టిందని ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు అందించారు. ఇప్పుడు మరోసారి ‘తండేల్’లో నాగచైతన్య, సాయి పల్లవి పెయిర్ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘తండేల్’ నుండి విడుదలయిన గ్లింప్స్ కూడా ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. ఇందులో నాగచైతన్య మత్స్యకారుడిగా నటించనున్నాడు. నాగచైతన్య, సాయి పల్లవి మధ్య నడిచే ఈ విలేజ్ లవ్ స్టోరీ చూడాలంటే 2025 ఫిబ్రవరీ 7 వరకు ఎదురుచూడాల్సిందే.

Thandel Release Date
Thandel Release Date

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×