E-Paper
Advertisement

Citadel Honey Bunny: హైదరాబాద్‌లో ‘సిటాడెల్ హనీ బన్నీ’ స్పెషల్ స్క్రీనింగ్.. యంగ్ హీరోతో సమంత సందడి

Citadel Honey Bunny: హైదరాబాద్‌లో ‘సిటాడెల్ హనీ బన్నీ’ స్పెషల్ స్క్రీనింగ్.. యంగ్ హీరోతో సమంత సందడి
Advertisement

Citadel Honey Bunny: హిందీలో ఒక్క సినిమాలో కూడా నటించకుండా బాలీవుడ్‌లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది సమంత. మునుపటిలాగా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ఓకే చేయకుండా తనకు ఎక్కువగా నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటూ నిధానంగా ముందుకెళ్తోంది సామ్. అలా తను యాక్షన్ హీరోయిన్‌గా మారి ఒక వెబ్ సిరీస్‌తో నేరుగా హిందీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యింది. అదే ‘సిటాడెల్ హనీ బన్నీ’ (Citadel Honey Bunny). ఇది ‘సిటాడెల్’ అనే అమెరికన్ వెబ్ సిరీస్‌కు ఇండియన్ వర్షన్‌గా తెరకెక్కింది. త్వరలోనే ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవ్వగా హైదరాబాద్‌లో దీనికి సంబంధించిన స్పెషల్ ప్రీమియర్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్.

స్పెషల్ ప్రీమియర్స్

Advertisement

‘సిటాడెల్ హనీ బన్నీ’లో సమంత (Samantha) సరసన వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. రాజ్ అండ్ డీకే దీనికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుండి విడుదలయిన టీజర్స్, ట్రైలర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందులోనూ ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో సమంత ఓ రేంజ్‌లో నటించిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇక నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో ‘సిటాడెల్ హనీ బన్నీ’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది. అందుకే ఈ సిరీస్‌ను ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం హైదరాబాద్‌లో స్పెషల్ ప్రీమియర్స్‌ను ఏర్పాటు చేసింది టీమ్. ఇందులో సమంతతో పాటు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) కూడా పాల్గొన్నాడు.

Also Read: తోడుగా నేనుంటా… నెటిజన్ ప్రపోజల్ కు సామ్ హార్ట్ ఫెల్ట్ రిప్లై

Advertisement

అప్పటినుండి ఫ్రెండ్‌షిప్

‘సిటాడెల్ హనీ బన్నీ’ కంటే ముందు ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది సమంత. ఈ సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే.. ఆ సిరీస్‌కు కూడా దర్శకత్వం వహించారు. అయితే అందులో సమంతతో పాటు సందీప్ కిషన్ కూడా యాక్ట్ చేశాడు. అలా సందీప్‌కు, రాజ్ అండ్ డీకేలకు మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే హైదరాబాద్‌లో జరుగుతున్న ‘సిటాడెల్ హనీ బన్నీ’ స్పెషల్ స్క్రీనింగ్‌కు సందీప్ కిషన్‌కు కూడా ఆహ్వానం అందింది. తను మాత్రమే కాకుండా యంగ్ బ్యూటీ కృతి శెట్టి కూడా ఈ స్పెషల్ ప్రీమియర్స్‌లో సందడి చేసింది. సందీప్, కృతి, సమంత కలిసి ‘సిటాడెల్ హనీ బన్నీ’ స్పెషల్ ప్రీమియర్స్‌ను వీక్షించారు.

కెమిస్ట్రీ అదుర్స్

2024లో సమంత అసలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. గతేడాది ‘శాకుంతలం’, ‘ఖుషి’ వంటి చిత్రాల్లో నటించిన తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుంది సామ్. అప్పటినుండి తను ‘సిటాడెల్ హనీ బన్నీ’ షూటింగ్‌లోనే బిజీగా ఉంది. మాయాసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత.. అసలు ఈ వెబ్ సిరీస్‌లో నటించడానికి ఇష్టపడలేదు. అయినా కూడా దర్శకులు రాజ్ అండ్ డీకేతో ఉన్న సాన్నిహిత్యంతో తను ఒప్పుకోక తప్పలేదు. ఈ సిరీస్‌లో యాక్షన్‌తో పాటు వరుణ్ ధావన్, సమంత మధ్య కెమిస్ట్రీ కూడా హైలెట్ అవ్వనుందని తెలుస్తోంది. ఇప్పటికే ‘సిటాడెల్ హనీ బన్నీ’ ప్రమోషన్స్ కోసం సమంత చాలా కష్టపడుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×