BigTV English

Nagababu : “ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. వాళ్లకు ఆర్థిక సహాయం చేశా”

Nagababu : “ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. వాళ్లకు ఆర్థిక సహాయం చేశా”

Konidela Nagababu : మెగా బ్రదర్ నాగబాబు.. ఆయనకు సినిమాలు పెద్దగా అచ్చిరాలేదు. నటుడిగా కాస్త ఫర్వాలేదు కానీ నిర్మాతగా మాత్రం ఫెయిలయ్యారు. ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ కాలేదు. తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి వెన్నంటే ఉంటూ.. జనసేన విజయానికి కృషి చేశారు.


ఇక కొడుకు వరుణ్ తేజ్ మాత్రం అడపా దడపా హిట్ కొడుతున్నాడు. కొంతకాలంగా వరుణ్ టైమ్ కూడా ఏమంత బాలేదనే చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజైనా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ కూడా సక్సెస్ కాలేదు. కానీ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే X వేదికగా వెల్లడించారు.

తన తల్లి గతేడాది అక్టోబర్ లో తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన నగదు బహుమతికి మరికొంత నగదును జతచేసి.. ఇండియన్ డిఫెన్స్ లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి భార్యలకు ఆర్థికసహాయం చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నట్లు చెప్పారు.


“ఆపరేషన్ వేలంటైన్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో AIR FORCE లో సేవలందిస్తూ ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకి నా వంతు సాయం చేస్తానని మాటిచ్చాను. ఇచ్చిన మాటకి గాను వారికి నేను 6 లక్షల రూపాయల సహకారం అందించాను. ఈ చిన్న సాయం పెద్ద గొప్పది కాకపోవచ్చు కాని ఇచ్చిన మాట మర్చిపోలేదన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. దేశ సేవలో ప్రాణాలర్పించిన వారికి తోడ్పాటు అందించే అవకాశం రావడం చాల అదృష్టంగా ఉందని తెలియజేయడానికి సంతోషంగా ఉంది” అని X వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లోనే ఆపరేషన్ వాలెంటైన్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన చెప్పిన వీడియోను షేర్ చేశారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×