E-Paper
Advertisement

Nagachaitanya Sobhita Wedding: అక్కినేని వారి ఇంట్లో పెళ్లి త్వరలోనే.. నాగచైతన్య వివాహం ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

Nagachaitanya Sobhita Wedding: అక్కినేని వారి ఇంట్లో పెళ్లి త్వరలోనే.. నాగచైతన్య వివాహం ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
Advertisement

Nagachaitanya Sobhita Wedding| సమంతతో విడిపోయిన మూడేళ్ల తరువాత ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య ముంబై భామ శోభిత ధులిపాళతో మళ్లీ ప్రేమలో పడిన తెలిసిందే. గత మూడేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో హైదరాబాద్ లో ఇద్దరూ ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు.

నాగచైతన్యకు కొత్త ఇంట్లో నిశ్చితార్థం ఆగస్టు 8న సంప్రదాయంగా జరిగింది. అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జరగబోతోంది? అనే చర్చ అక్కినేని ఫ్యాన్స్ మధ్య మొదలైంది. మీడియా కథనాల ప్రకారం.. నాగచైతన్య రెండో వివాహం ఈ ఏడాది చివరిలోగా లేదా 2025 సంవత్సరం మార్చి నెలలో ఉండబోతోంది. అలాగే పెళ్లి హైదరాబాద్ లో కాదండోయ్. వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట.

Advertisement

నాగచైతన్య పెళ్లి రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లేదా ఫారిన్ లో ఒక ఖరీదైన వెడ్డింగ్ రిసార్ట్ లో జరుగనుందని తెలిసింది. అయితే మార్చి 2025లో పెళ్లి అని మాత్రమే ఇప్పటివరకు సమాచారం ఉంది. మార్చి నెలలో ఏ తేదీన అని కచ్చితంగా ఖరారు కాలేదు.

Advertisement

నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో, సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీకాకుశంలో జరుగుతోంది. తండేల్ 2025 ప్రథమార్థంలో విడుదల కానుంది.

శోభితను ఇష్టపడని దగ్గుబాటి ఫ్యామిలీ?
సోషల్ మీడియాలో జరుగుతున్న గాసిప్స్ ప్రకారం.. నాగచైతన్య మేనమామ దగ్గుబాటి వెంకటేష్, అతని కజిన్స్ రానా దగ్గుబాటి, మాళవిక దగ్గుబాటి, ఆశ్రిత దగ్గుబాటి ఇప్పటిీ నాగచైతన్య మాజీ భార్య సమంతనే ఇష్టపడుతున్నారట. ఇన్స్‌టాగ్రామ్ లో ఇంకా సమంతనే ఫాలోఅవుతున్నారు. శోభితను సోషల్ మీడియాలో వీరిలో ఎవరూ ఇంకా పలకరించనేలేదట. పైగా నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ కి కూడా దగ్గుబాటి కుటుంబం నుంచి ఎవరూ రాకపోవడం గమనించాల్సిన విషయం. సమంత, నాగచైతన్య 2017లో పెళ్లి చేసుకున్నారు. ఎంతో ముచ్చటగా కనిపించే వీరి జంట 2021లో విడిపోయింది.

Also Read: ఆ హీరోయిన్ తో ముద్దు.. తండ్రిని పర్మిషన్ అడిగిన ప్రభాస్

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×