E-Paper
Advertisement

Nandamuri Balakrishna: నందమూరి వారసులు వారే.. తేల్చి చెప్పిన బాలయ్య

Nandamuri Balakrishna: నందమూరి వారసులు వారే.. తేల్చి చెప్పిన బాలయ్య
Advertisement

Nandamuri Balakrishna: నందమూరి తారక రామారావు.. ఇది పేరు మాత్రమే కాదు. ఒక బ్రాండ్.. ఎప్పటికీ  మారని ఒక ట్రెండ్.. ఒక చరిత్ర.. తెలుగు ప్రజలకు ఒక గుర్తింపు. అలాంటి మహనీయుడు లెగసీని కాపాడుకుంటూ వస్తున్నది నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ. నందమూరి వారసులు ఎంతమంది ఉన్నా.. అందులో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకమైనే చెప్పాలి. కానీ, ఎప్పుడు నందమూరి కుటుంబం తారక్ ను వారసుడుగా ఒప్పుకోలేదు. అందుకు కారణం.. తారక్.. నందమూరి హరికృష్ణ రెండో భార్య కుమారుడు కావడమే.

నిజం చెప్పాలంటే హరికృష్ణ బతికి ఉన్నంతకాలం.. ఎన్టీఆర్ ను, కళ్యాణ్ రామ్ ను నందమూరి కుటుంబం సమానంగానే చూసుకున్నారు. హరికృష్ణ మారణానంతరం కళ్యాణ్ రామ్ కు, ఎన్టీఆర్ కు తండ్రిగా మారాడు బాబాయ్ బాలకృష్ణ. అయితే ఉన్నాకొద్దీ.. వీరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. కారణాలు ఏమైనా కానీ, నందమూరి కుటుంబానికి, తారక్ కు మధ్య దూరం పెరుగుతూ వస్తుంది.  నందమూరి బాలకృష్ణ ఎప్పుడు తారక్ ను వారసుడుగా గుర్తించడం లేదు అనేది అందరికి తెల్సిన విషయమే.

Advertisement

ఇక ఇవేమి పట్టించుకోని అన్నదమ్ములు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. ఇప్పటికీ నందమూరి కుటుంబానికి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు నందమూరి వంశం గురించి మాట్లాడినా.. బాలయ్య, అన్న పిల్లల గురించి చెప్పకపోవడం గమనార్హం. తాజాగా మరోసారి బాలయ్య.. నందమూరి వారసులు ఎవరో తేల్చి చెప్పాడు. నిన్నటి నుంచి దుబాయ్ లో ఐఫా 2024 వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెల్సిందే.

గతేడాది బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాకు అనిల్ రావిపూడి ఉత్తమ దర్శకుడుగా అవార్డును అందుకున్నాడు. ఇక  బాలయ్యకు గోల్డెన్ లెగసీ అవార్డును అందుకున్నాడు. ఇక ఈ ఈవెంట్ లో బాలయ్య.. తన వారసుల గురించి మాట్లాడాడు. “గోల్డెన్ లెగసీ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మా నాన్నగారి నుంచి వచ్చింది. అది నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ అవార్డును ఆయనకే అంకితమిస్తాను” అని తెలిపాడు.

Advertisement

సినీ పరిశ్రమలో నందమూరి తారక రామారావు వారసులు బాలకృష్ణ.. మరి బాలకృష్ణ వారసులు ఎవరు.. ? అన్న ప్రశ్నకు బాలయ్య మాట్లాడుతూ.. ” నా కొడుకు మోక్షజ్ఞ.. నా మనవడు. ఇంకెవరున్నారు” అని టక్కున చెప్పాడు. ఆ ప్రశ్నకు బాలయ్య చెప్పిన సమాధానం కరెక్టే అయినా.. వారసులు అంటే.. ఎన్టీఆర్ కూడా వస్తాడు కదా.. అతని పేరును చెప్పకపోవడం కొద్దిగా బాధగా ఉందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక నందమూరి వారసుడుగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న విషయం తెల్సిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మోక్షజ్ఞ ఎంతో కష్టపడి బరువు తగ్గి.. హీరో మెటీరియల్ గా మారాడు. ఇక ప్రశాంత్ వర్మ.. మోక్షును హీరోగా సానబెడుతూ.. మంచి అవుట్ ఫుట్ వచ్చేలా ప్రయత్నిస్తున్నాడని టాక్. మరి ఈ సినిమాతో  నందమూరి నట వారసుడు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో అనేది చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×