E-Paper
Advertisement

Nandamuri Chaitanya Krishna: తారక్ ఫ్యాన్స్ పై నందమూరి వారసుడు ఫైర్.. బొచ్చు కూడా పీకలేరు

Nandamuri Chaitanya Krishna: తారక్ ఫ్యాన్స్ పై నందమూరి వారసుడు ఫైర్..  బొచ్చు కూడా పీకలేరు
Advertisement

Nandamuri Chaitanya Krishna: నందమూరి ఇంట విబేధాలు బయటపడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్ కు, నందమూరి కుటుంబానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఎన్నోసార్లు నందమూరి కుటుంబం ఎన్టీఆర్ ను పట్టించుకోలేదు. వారసుడుగా లెక్కలోకి తీసుకోలేదు. హరికృష్ణ ఉన్నన్ని రోజులు ఎన్టీఆర్ బాగానే ఉన్నా .. ఆయన పోయిన దగ్గరనుంచి నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ను దూరం పెట్టింది అనే మాటలు వినిపిస్తూనే ఉనాన్యి. కొన్ని ఫంక్షన్స్ లో కళ్లకు కూడా కనిపించాయి.

ఇక ఇలాంటివి ఎన్ని జరిగినా ఎన్టీఆర్ మౌనం వహిస్తూనే వస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ లా ఆయన ఫ్యాన్స్ మాత్రం మౌనంగా ఉండడంలేదు. సందు దొరికినప్పుడల్లా తమ అభిమాన హీరోను ఏమైనా అంటే అస్సలు బాగోదని వార్నింగ్ లు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇక మే 20 న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వైసీపీ నేత అయిన కొడాలి నాని.. తారక్ ను విష్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు కొడాలి నాని, తారక్, వల్లభనేని వంశీ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ఎప్పుడైతే కొడాలి నాని పార్టీ మారాడో అప్పటినుంచి తారక్.. ఆయనతో మాట్లాడడం మానేశాడు.

Advertisement

ఇక చాలా కాలం తరువాత కొడాలి నాని.. ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలుపు పోస్ట్ చేశాడు. దీంతో ఎన్టీఆర్ ఫాన్స్ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీకి ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తాడని, సొంతవాళ్ళు పట్టించుకోకపోయినా ఫ్రెండ్స్ పట్టించుకుంటున్నారని.. ఇలా రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ పై నందమూరి వారసుడు చైతన్య కృష్ణ ఫైర్ అయ్యాడు. అప్పుడెప్పుడో ధమ్ అనే సినిమా చేశాడు. అది అసలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు.

ఇక దాదాపు కొన్నేళ్ల తరువాత బ్రీత్ అనే సినిమాతో వచ్చాడు. అది కూడా అంతగా విజయం సాధించలేకపోయింది. సినిమాలు కాకుండా చైతన్య కృష్ణ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. తన మామయ్య చంద్రబాబును కానీ, బాబాయ్ బాలయ్యను కానీ ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోడు. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై చైతన్య కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Advertisement

” వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీకి సపోర్ట్ చేసిన జూనియర్ ఫ్యాన్స్ కు ఇదే నా వార్నింగ్. మీరు సపోర్ట్ చేశారు అని అంటున్నారు. మీరు ఎవరు నా బొచ్చు కూడా పీకలేరు. నేను ఉండగా చంద్రబాబు నాయుడు మావయ్యను, నందమూరి బాలకృష్ణ బాబాయ్ ను ఎవరు టచ్ చెయ్యలేరు. నా సినిమా రిలీజ్ అయ్యినప్పుడు కూడా తారక్ ఫ్యాన్స్, వైసీపీ కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు. జాగ్రత్తగా ఉండండి” అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫాన్స్ సీరియస్ అవ్వడం పక్కన పెడితే జోకర్ అంటూ కామెడీ చేస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×