BigTV English

Chidambaram comments on Modi, Shah age remarks: అమిత్ షా కామెంట్స్ రివర్స్, మోదీకి తగిలిందా?

Chidambaram comments on Modi, Shah age remarks: అమిత్ షా కామెంట్స్ రివర్స్, మోదీకి తగిలిందా?

Chidambaram comments on Modi, Shah age remarks: సార్వత్రిక ఎన్నికలతోపాటు ఒడిషా శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఒకే అంశంపై రచ్చ కొనసాగుతోంది. ఈసారి కమలనాథులు ఒడిషాలో పాగా వేయాలని స్కెచ్ వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ప్లాన్‌ ఇంప్లిమెంట్ చేసే పనిలో పడ్డారు.


సీఎం నవీన్ పట్నాయక్‌పై అమిత్ షా చేసిన కామెంట్స్ బూమరాంగ్ అయ్యాయి. చివరకు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎత్తుకుంది. మోదీకి అమిత్ షా ఎర్త్ పెడుతున్నారంటూ తనదైన శైలిలో సెటైర్లు వేసింది. అసలేం జరిగింది.

ఒడిషాలో ఈసారి అధికారంలోకి రావాలని బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సీఎం నవీన్ పట్నాయక్ వయస్సుపై కామెంట్స్ చేశారు కేంద్రమంత్రి అమిత్ షా. నవీన్‌‌కు ఇప్పుడు 77 ఏళ్ల అని, వయస్సు పెరిగినకొద్దీ అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని వ్యాఖ్యానించారు. ఇక ఆయన రాజకీయాల నుంచి రిటైర్ అవ్వడమే మంచిదన్నారు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంది కాంగ్రెస్ పార్టీ.


అమిత్ షా కామెంట్స్‌పై తనదైనశైలిలో స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. వయసు రీత్యా సీఎం నవీన్ రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని షా చెబుతున్నారని అన్నారు. ఒక వేళ బీజేపీ అధికారం లోకి వస్తే ప్రధాని నరేంద్రమోదీకి ఆయన ఇస్తున్న సూచన ఇదేనా అంటూ ప్రశ్నించారు. కమలం అధికారంలోకి రాకపోతే హ్యాపీగా ఫీలయ్యే వ్యక్తి షా అని చెప్పుకొచ్చారు. అప్పుడు మోదీ కాకుండా ఆయనే ప్రతిపక్ష సీటులో కూర్చునేలా ఉన్నారని పోస్టు చేశారు.

సీఎం నవీన్ వయస్సు 77 ఏళ్లు కాగా, ఆ పార్టీలో వయస్సు నిబంధన అనేది లేదు. బీజేపీలో మాత్రం 75 ఏళ్ల వయస్సు దాటితే ఆయా నేతలను పక్కన పెట్టాలనే నిబంధన ఉంది. 2014 ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ దీన్ని తీసుకొచ్చారు. ఆ లెక్కన నరేంద్రమోదీ వయస్సు 74 ఏళ్లు. ఆ లెక్కన చూస్తే మరో ఏడాది మాత్రమే ఆయన రాజకీయాల్లో ఉంటారు. ఆ తర్వాత ఆయన తప్పుకోవడం ఖాయమన్నమాట.

ALSO READ: మోదీపై హాట్ కామెంట్స్, చేసింది చాలు, ప్రజా జీవితం నుంచి..

ఆ నిబంధన కారణంగా బీజేపీలోని చాలామంది సీనియర్లు అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి నేతలు రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు అదేబాటలో పయనిస్తారా? అనేది ఆ పార్టీకి పెద్ద ప్రశ్న. వారం కిందట ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇదే విషయాన్ని లేవనెత్తిన విషయం తెల్సిందే.

Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×