E-Paper
Advertisement

Indian Airforce Recruitment 2024 : ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. పైలట్ పోస్టుల్లో బంపర్ రిక్రూట్ మెంట్

Indian Airforce Recruitment 2024 : ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. పైలట్ పోస్టుల్లో బంపర్ రిక్రూట్ మెంట్
Advertisement

Indian Airforce Recruitment 2024 : ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి ఇదే మంచి ఛాన్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) 2024 ద్వారా అనేక పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్ సైట్ afcat.cdac.in ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మే 30, 2024 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 28, 2024 వరకూ దరఖాస్తులకు సమయం ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

ఈ రిక్రూట్ మెంట్ ప్రక్రియ కింద.. ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ లో మొత్తం 304 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థి.. గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 12వ సైన్స్ స్ట్రీమ్ (PCM) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ డిగ్రీని పొంది ఉండాలి.

Advertisement

అభ్యర్థుల వయసు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. 21-24 మధ్య వయసు గలవారు అర్హులు. అంతకన్నా తక్కువ వయసున్నా, ఎక్కువ వయసున్నవారి దరఖాస్తులు రిజెక్ట్ అవుతాయి.

అర్హులైన అభ్యర్థుల రిక్రూట్ మెంట్ కోసం వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆపై ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం 300 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ఇందుకోసం మొత్తం 2 గంటల సమయం ఇస్తారు.

దరఖాస్తు ప్రక్రియ
Advertisement

దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ afcat.cdac.inకి వెళ్లండి.
హోమ్ పేజీలో ఉన్న రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
అవసరమైన అన్ని సమాచారాన్ని అక్కడ పూర్తిచేయండి.
అవసరమైన పత్రాలను స్కాన్ చేసి.. కాపీలను అప్‌లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి నిర్ణీత దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, దరఖాస్తు ఫారమ్‌ను మీ వద్ద ఉంచుకోండి.

 

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×