BigTV English

Amigos Movie:‘అమిగోస్’ కోసం యంగ్ టైగర్.. మరోసారి అన్నయ్య కోసం తారక్

Amigos Movie:‘అమిగోస్’ కోసం యంగ్ టైగర్.. మరోసారి అన్నయ్య కోసం తారక్

Amigos Movie:డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ‘అమిగోస్’ మూవీ టీజ‌ర్‌, సాంగ్స్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. శుక్ర‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను కర్నూలులో చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ , నిర్మాత య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..


హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘2022లో బింబిసార సినిమాతో మీ ముందుకు వచ్చాను. ఆ సినిమాకు మీరు చూపించిన ఆద‌రాభిమానాలు చూసి చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నాను. కొత్త సినిమాల‌ను చేసిన ప్ర‌తీసారి ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూనే వ‌చ్చారు. అలాగే అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం. తాత‌గారు రాముడు భీముడు చేశాడు. తర్వాత బాబాయ్ చేశాడు. త‌ర్వాత త‌మ్ముడు జై ల‌వ‌కుశ చేశాడు. ఇవ‌న్నీ అన్న‌ద‌మ్ముల మ‌ధ్య క‌థ‌. అయితే అమిగోస్ మ‌నుషుల‌ను పోలిన మ‌నుషులు ఏడుగురుంటార‌ని తెలుసు. అలాంటి ముగ్గురు మ‌ధ్య జ‌రిగే క‌థ‌. థియేట‌ర్‌లో మీరు డిస‌ప్పాయింట్ కారు. మీరు మాపై చూపించే అభిమానానికి ఇంకో సూప‌ర్ హిట్ సినిమా రాబోతుంది. ఫిబ్ర‌వ‌రి 10న మూవీ మీ ముందుకు రానుంది. ఎల్లుండి జ‌ర‌గ‌బోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు త‌మ్ముడు గెస్ట్‌గా వ‌స్తున్నాడు’’ అన్నారు.


Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×