E-Paper
Advertisement

Nani 33: దసరా కాంబో రిపీట్.. మాస్ లుక్‌లో నాని ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్

Nani 33: దసరా కాంబో రిపీట్.. మాస్ లుక్‌లో నాని ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్
Advertisement
NANI 33
NANI 33

Nani Announces His 33rd Movie With Dasara Team: నేచురల్ స్టార్ నాని డిఫరెంట్ మూవీలతో ప్రేక్షకుల్ని విపరీతంగా అలరిస్తున్నాడు. కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. గతేడాది ఏకంగా రెండు సినిమాలతో వచ్చి సూపర్ హిట్లు అందుకున్నాడు. మొదటగా దసరా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీపై ఫస్ట్ నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌తో అందరినీ ఆకట్టుకుంది.

దీంతో ఫస్ట్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడంతో ప్రేక్షకాభిమానులు థియేటర్లకు పరుగులు పెట్టారు. ఇక మొదటి షో నుంచే మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. అయితే నాని కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా దసరా నిలిచింది. ఈ సినిమాని కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు.

Advertisement

అలాగే గతేడాది చివర్లో ‘హాయ్ నాన్న’ మూవీతో వచ్చి మరొక హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ తండ్రీ, కూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కడంతో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద కూడా భారీ కలెక్షన్లను నమోదు చేసింది. అయితే ఈ మూవీని కూడా కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేసి హిట్ కొట్టడం విశేషం.

Also Read: రౌడీ హీరో ‘ఫ్యామిలీ స్టార్’ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Advertisement

ఎంతో మంది స్టార్ హీరోలు కొత్త దర్శకులతో సినిమా చేస్తే హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా అని ఆలోచిస్తుంటారు. కానీ నాని మాత్రం వాటికి భిన్నంగా ఉంటాడు. కొత్త దర్శకులైనా తనకు కథ నచ్చితేనే సినిమాలు చేస్తున్నాడు. అందువల్లనే హిట్లు కొడుతున్నాడు. అయితే ఇప్పుడు నాని తన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించాడు.

తాజాగా మరొక కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. తనకు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ‘దసరా’ మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరొక సినిమాను ప్రకటించాడు. ‘దసరా’ మూవీ రిలీజ్ అయి ఏడాది గడుస్తున్న సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు. అందులో నాని ఒక స్టైలిష్ లుక్‌లో కళ్లద్దాలు పెట్టుకుని బీడీ తాగుతూ మాస్ లుక్‌లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేక్స్ రిలీజ్ చేశారు.

నాని కెరియర్‌లో 33వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారిక టైటిల్‌ను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు. ఈ అప్డేట్‌తో అభిమానుల్లో ఫుల్ జోష్ మొదలైంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×