Big Stories

Do Or Die For Chandrababu : టిడిపికి ఈ సారి డూ ఆర్ డై! మరి బాబు ప్లాన్ ఏంటి?

 Chandrababu

- Advertisement -
- Advertisement -

ఏపీలో ఈసారి జరిగే ఎన్నికలు. టీడీపీ అధినేత చంద్రబాబుకు చాలా కీలకం. ఎందుకంటే ఆయన అధికారంలోకి వస్తేనే. ఆ తర్వాత పార్టీకి ఏపీలో మనుగడ ఉంటుంది. లేదంటే కష్టమే అన్న ప్రచారం జరుగుతోంది. మాములుగానే ఏపీలో రాజకీయ పార్టీలో భారీగా ఖర్చు పెడుతుంటాయి. ఒకసారి విపక్షంలో ఉంటే. కానీ రెండోసారి కూడా విపక్షానికే పరిమితమైతే అధికార పక్షాన్ని ఎదుర్కొని నిలబడటం కష్టం. అందులో జగన్ మోహన్ రెడ్డి లాంటి నేతకు ఎదురొడ్డి నిలబడం మాములు విషయం కానేకాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌ బీఆర్ఎస్‌నే తీసుకొవచ్చు. పదేళ్లు తెలంగాణను పాలించింది బీఆర్ఎస్‌.. అత్యంత ధనిక పార్టీ కూడా.. కానీ ఓడిన మూడు నెలల్లోనే ఆ పార్టీ పరిస్థితి ఏమైందో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం.

Also Read: సీఎం జగన్ వాహనంపై చెప్పు, అందుకేనా పరదాలు?

గత కొంతకాలంగా చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు వైసీపీ నేతలు.. ఆయన వయసును పరిగణలోకి తీసుకొని ఈ కామెంట్స్‌ చేస్తున్నారు నేతలు.. నిజానికి ఆయన వయసును పరిగణలోకి తీసుకుంటే.. వచ్చే ఐదేళ్లలో పార్టీని బలోపేతం చేసే అవకాశముండదనే చెప్పాలి. ఇప్పుడు గెలవకుంటే.. ప్రజలు టీడీపీని సుదీర్ఘకాలం ఆదరించరన్న భయం కూడా.. పార్టీ నేతల్లో మొదలయ్యే చాన్స్‌ ఉంది. అందుకే ఈ ఎన్నికలు చంద్రబాబుకు డూ ఆర్ డై.

దీనికి తోడు టీడీపీలో నెక్ట్స్ జనరేషన్‌ లీడర్‌షిప్‌.. ఇంకా పగ్గాలు పట్టుకునేందుకు రెడీగా లేదన్న చర్చ జరుగుతోంది. నారా లోకేష్.. మధ్యలో పార్టీ బాధ్యతలు భుజాన వేసుకున్నా.. అనుకున్న ఫలితాలు రాలేదు.. జగన్‌ను ఆయన సమర్థవంతంగా ఎదుర్కోలేక పోయారన్న చర్చ ఉంది. అందుకే మళ్లీ సీన్‌లోకి చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు. పార్టీని పరుగులు పెట్టించారు..

నిజానికి టీడీపీ బలమైన పార్టీ. దశాబ్దాలుగా ప్రజల్లో ఉన్న పార్టీ.. బూత్ లెవెల్లో పటిష్టమైన క్యాడర్ ఉన్న పార్టీ.. అయినా కానీ పొత్తులకు అంగీకరించారు చంద్రబాబు కాపు ఓటర్లు మద్ధతున్న జనసేన పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో బరిలోకి దిగుతున్నారు. ఏదీ ఏమైనా మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలన్నదే ఈ కూటమిగా రావడం వెనకున్న అసలు వ్యూహాం.. మాములుగానే చంద్రబాబుకు రాజకీయాల్లో అపర చాణక్యుడన్న పేరుంది. కానీ ఈసారి ఓడితే మాత్రం ప్రజలతో పాటు.. ఆ పార్టీ నేతల్లో కూడా ఆ నమ్మకం పోతుంది.

Alos Read: నారా లోకేష్‌‌కు జెడ్ కేటగిరీ భద్రత.. కేంద్రం ఆదేశాలు జారీ

అందుకే చంద్రబాబు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు. వాలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన ఆయనే. వాలంటీర్లు మనవాళ్లే అంటున్నారు. వీటన్నింటి కంటే.. లాస్ట్ ఎలక్షన్స్‌లా కాకుండా ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు. దీంతో మాములుగానే అసంతృప్తి జ్వాలలు ఎగిశాయి. నిన్నటి వరకు ఏ చేతితో అయితే టీడీపీ జెండాను మోశారో.. ఇప్పుడదే చేతులతో అవే జెండాలను తగులపెడుతున్నారు. కొందరు కీలక నేతలకు టికెట్లు దక్కలేదు. కూటమి నేతలకు దక్కిన స్థానాల్లో టీడీపీ నేతలు ఎంత మేర సహకరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి చంద్రబాబు ఈ అసంతృప్తులను బుజ్జగించగలరా? అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వీటన్నింటి కంటే అతి ముఖ్యమైనది. మళ్లీ గెలిస్తేనే అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తానని శపథం చేశారు చంద్రబాబు. అలా శపథం చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు మళ్లీ అసెంబ్లీ గుమ్మం తొక్కలేదు. పార్టీ గెలవకపోతే ఆయన ఇక శాసనసభకు వచ్చే అవకాశం కూడా లేదు. సో పార్టీ బతకాలన్న.. నెక్ట్స్‌ జనరేషన్‌ లీడర్ షిప్‌ను డెవలప్ చేయాలన్నా.. మళ్లీ చంద్రబాబు అసెంబ్లీకి రావాలన్నా.. క్యాడర్, లీడర్ కకావికలం కాకూడదన్నా.. చంద్రబాబు మళ్లీ గెలవాల్సిందే.. లేదంటే ఐదేళ్లలోనే చుక్కలు చూపించిన సీఎం జగన్.. ఈసారి ఆ చాన్స్‌ కూడా ఇవ్వడు.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News