E-Paper
Advertisement

Nani: జెర్సీ స్పెషల్ షోస్.. ఎమోషనల్ అయిన నాని

Nani: జెర్సీ స్పెషల్ షోస్.. ఎమోషనల్ అయిన నాని
Advertisement

Nani: న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లిస్ట్ లో జెర్సీ ఎప్పుడు ముందు స్థానంలో ఉంటుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్బైనార్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో నాని సరసన శ్రద్దా శ్రీనాథ్ నటించింది. 2019 ఏప్రిల్ 19 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

జెర్సీ.. ఒక తండ్రికొడుకుల కథ. ఎన్నో ఎమోషన్స్ తో కూడుకున్న కథ. కొడుకు కోసం 40 ఏళ్లు దాటిన ఒక తండ్రి తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఎలా క్రికెటర్ గా మారాడు అనేది జెర్సీ కథ. అర్జున్ పాత్రలో నాని నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు. ఇక జెర్సీ సినిమా నేటితో ఐదేళ్లు పూర్తిచేసుకుంది. దీంతో నేడు హైదరాబాద్ లో పలుచోట్ల స్పెషల్ షోస్ వేశారు. ఈ స్పెషల్ షోస్ లలో కూడా నాని అభిమానులు ఒక్క సీటు కూడా వదలకుండా మళ్లీ సినిమాను చూసి ఎంజాయ్ చేశారు. అర్జున్ సక్సెస్ ని తమ సక్సెస్ అనుకోని ఆనందపడిపోయారు.

Advertisement

ఇక ఈ అభిమానానికి నాని కూడా ఎమోషనల్ అయ్యాడు. జెర్సీ స్పెషల్ షోస్ నుంచి వస్తున్న అభిమానం చూసి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు థాంక్స్ చెప్పాడు. “ఈ రోజు అర్జున్ ప్రయాణాన్ని పునశ్చరణ చేసుకుని మళ్లీ వీడ్కోలు చెప్పడానికి ఆకాశం నుండి తిరిగి వచ్చినట్లు అనిపించింది. గుండె బరువుగా మరియు నిండుగా ఉంది” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×