Big Stories

Kunwar Sarvesh Kumar Singh: బీజేపీకి బిగ్ షాక్.. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే.. ఎంపీ అభ్యర్థి మృతి

BJP MP Kunwar Sarvesh Kumar Singh Passes Away: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా తొలిదశ పోలింగ్ ముగిసిన 24 గంటల వ్యవధిలోనే యూపీలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మృతి చెందారు. గతకొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేశ్ సింగ్ కన్నుమూశారు. ఆయనకు శనివారం సాయంత్రం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు బీజేపీ ఎమ్మెల్యే రితేష్ గుప్తా వెల్లడించారు. కున్వర్ సర్వేశ్ సింగ్ భౌతికకాయాన్ని మొరాదాబాద్‌లోని ఠాకూర్‌ద్వారా ప్రాంతానికి తీసుకురానున్నారు.

- Advertisement -

ఆయన గొంతు సమస్యతో శుక్రవారం ఢిల్లీలోని ఎయిమ్స్ లో హెల్త్ చెకప్ కోసం చేరినట్లు యూపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి తెలిపారు. ఇటీవలే ఆయన గొంతు సమస్యకు శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నట్లు వెల్లడించారు. అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేదని భూపేంద్ర చౌదరి తెలిపారు. మొరాదాబాద్ లోక్‌సభ స్థానానికి శుక్రవారం ఓటింగ్ పూర్తయింది. ఇక్కడ ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీలతో బీజేపీ పోటీ పడింది.

కున్వర్ సర్వేశ్ ఓ వ్యాపార్తవేత్త కాగా.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అతను 1991 నుంచి 2007 వరకు, 2012లో ఠాకూర్‌ద్వారా స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో మోడీ హవాలో పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కున్వర్ సర్వేశ్ సింగ్ కుమారుడు కున్వర్ సుశాంత్ సింగ్ ప్రస్తుతం బర్హాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

మొరాదాబాద్ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేశ్ సింగ్ చాలా కాలం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకప్పుడు అమ్రోహా నుంచి ఎంపీగా కూడా ఉన్నారు. అంతేకాకుండా, అతని తండ్రి కూడా ఈ ప్రాంతం నుంచి ఎంపీగా పనిచేశారు. సర్వేష్ సింగ్ తండ్రి రాజా రాంపాల్ సింగ్ కూడా ఠాకూర్‌ద్వారా నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఎన్నికల్లో గెలిస్తే ఉప ఎన్నిక వస్తుంది..
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. కున్వర్ సర్వేశ్ సింగ్ గెలిస్తే మొరాదాబాద్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థి గెలిస్తే ఉప ఎన్నిక జరగదు. మొరాదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ సిట్టింగ్ ఎంపీ ఎస్టీ హసన్ టిక్కెట్టును రద్దు చేసి రుచి వీరను పోటీకి దింపింది. ఎన్నికల ప్రచారంలో కూడా సర్వేష్ సింగ్ కూడా పాల్గొనలేదు. సర్వేశ్ సింగ్ కుటుంబం అతని కోసం ప్రచారం చేసింది.

బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ కున్వర్ సర్వేశ్ సింగ్ మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇది బీజేపీ కుటుంబానికి తీరని లోటని.. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా ఆయనకు నివాళులర్పించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News