E-Paper
Advertisement

CJI DY Chandrachud: ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటువేసే అవకాశం కోల్పోవద్దు..సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పిలుపు

CJI DY Chandrachud: ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటువేసే అవకాశం కోల్పోవద్దు..సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పిలుపు
Advertisement

CJI DY Chandrachud: ఎన్నికల్లో ఓటు వేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని.. ఇది దేశ ప్రజలందరి కర్తవ్యమని గుర్తు చేశారు.

2024 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ ‘మై ఓట్ మై వాయిస్’ విషన్ కు ఆయన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మన దేశం అని.. మన రాజ్యాంగం దేశంలోని పౌరలందిరికీ అనేక హక్కులను కల్పించిందన్నారు.

Advertisement

దేశంలోని ప్రతి ఒక్కరూ తనకు అప్పగించిన ఓటు అనే కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు. దేశ పౌరలకు రాజ్యాంగం కల్పించిన విధుల్లో ముఖ్యమైనది ఓటు వేయడమని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. దేశ పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓటు వేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులకోవద్దని అభ్యర్థించారు.

ప్రతి ఒక్కరు ప్రతి ఐదు సంవత్సరాలకు ఐదు నిమిషాలు కేటాయించి.. గర్వంగా ఓటు వేయాలని సీజేఐ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఐదు నిమిషాలు లైన్ లో నిల్చుని ఓటు వేయాలని కోరారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో పౌరులదే అతి పెద్ద పాత్ర అని.. అందుకే మన రాజ్యాంగంలో భారత ప్రభుత్వం ప్రజలచే.. ప్రజల కొరకు అని రాసి ఉందన్నారు.

Advertisement

Also Read: Lok Sabha Elections 2024: మరో సారి గెలిచేది మేమే.. ఎందుకంటే?

ఈ తరుణంలో తాను సారిగా ఓటు వేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి ఉన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపించిందని వెల్లడించారు. న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్నా సరే.. ఓటు వేసే కర్తవ్యాన్ని ఎప్పుడూ మరిచిపోలేదన్నారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×