BigTV English

Hit 3 HD Leak : చిత్ర బృందానికి షాక్.. ఆన్లైన్లో HD ప్రింట్ లీక్..!

Hit 3 HD Leak : చిత్ర బృందానికి షాక్.. ఆన్లైన్లో HD ప్రింట్ లీక్..!

Hit 3 HD Leak : హీరో నాని (Nani) తాజాగా నటించిన చిత్రం హిట్ 3 (Hit 3). ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నిన్న (మే1న) విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సినిమా విడుదలై 24 గంటలు కూడా గడవకముందే అప్పుడే చిత్ర బృందానికి భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఒరిజినల్ ఆడియోతో హెచ్డి ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం అటు ఇండస్ట్రీలో కూడా తీవ్ర కలకలం రేపింది. సినీ వర్గాలు, నాని అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక పైరసీని కట్టడి చేసి చిత్ర పరిశ్రమను కాపాడాలని సినీ పెద్దలు కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరొకవైపు ఈ సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు డైరెక్టర్ శైలేష్ కొలను (Director Sailesh Kolanu), హీరో నాని.. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.


నాని హిట్ 3 స్టోరీ..

హిట్ 3 విషయానికి వస్తే ఎస్పీ అర్జున్ సర్కార్ (నాని) జమ్మూ కాశ్మీర్ నుంచి ఏపీకి బదిలీ మీద వస్తారు. ఇక డ్యూటీలో జాయిన్ అవడానికి ముందే అడవిలో ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేస్తారు. ఆ తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్న సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష (కోమలి ప్రసాద్) అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్ సర్కార్.. అతడు హత్యలు ఎందుకు చేస్తున్నాడు..? ఆమెకు వివరిస్తూ సీటీకే డార్క్ వెబ్సైట్ గురించి చెబుతాడు.. అసలు సీటీకే ఉద్దేశం ఏమిటి? ఆ డార్క్ వెబ్సైటు రన్ చేస్తున్నది ఎవరు? వారి లక్ష్యం ఏమిటి ? అర్జున్ సర్కార్ సీటీకే గ్యాంగ్ ఆటలకు ఎలా అడ్డుకట్ట వేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏమిటి? అర్జున్ సర్కార్ జీవితంలోకి హీరోయిన్ ఎలా వచ్చింది..? ఆపరేషన్ కి ఆమె ఎలా సహాయపడింది? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.


ఎలా వుందంటే..?

ఇకపోతే మొత్తానికి సినిమా మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుతుంది. హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన హిట్ 3 ఒక హత్య చుట్టూ కాకుండా కొన్ని హత్యలు చుట్టూ తిరుగుతుంది. ఈ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? హీరో ఎలా పరిష్కరించాడు? అనేది సినిమా కథ. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల కథలన్నీ కూడా దాదాపు ఇదే తరహాలో ఉంటాయి.

అయితే దీన్నీ తెరపై మాత్రం ఆసక్తికరంగా, భయంకరంగా ఎంత బాగా చూపించారు అనే దాని పైన విజయం ఆధారపడి ఉంటుంది. ఇక ఈ విషయం డైరెక్టర్ కి బాగా తెలుసు. కాబట్టి హిట్ ఫ్రాంచైజీలలో క్రైమ్ సీన్లు అన్ని కూడా భయంకరంగానే తీర్చిదిద్దాడు అయితే హిట్ 3 లో ఆ భయాన్ని మూడింతలు చేశాడని చెప్పవచ్చు . సైకో గ్యాంగ్ చేసే అరాచకాలు చూస్తే మనకే రక్తం మరిగిపోతుంది.అసలు వీళ్ళు మనుషులేనా అనే అనుమానం కలుగుతుంది. ఇక మొత్తానికి అయితే యాక్షన్ పర్ఫామెన్స్ తో సినిమాను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×