Thalapathy Vijay : కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న నటుడు తలపతి విజయ్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన స్నేహితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. శంకర్ కి ఉన్న బ్రాండ్ వలన ఆ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఆ సినిమా తర్వాత మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం హైదరాబాద్ కి అప్పట్లో వచ్చాడు విజయ్. ఆ తర్వాత విజయ్ నటించిన చాలా సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి కానీ తెలుగు ప్రమోషన్స్ మాత్రం విజయ్ ఏ రోజు హాజరు కాలేదు. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి చేసిన వారసుడు సినిమా ప్రమోషన్స్ కు కూడా విజయ్ హాజరు కాలేదు. ఇక విజయ్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది అని చెప్పాలి. విజయ్ చేసిన ఎన్నో సినిమాలు ఇక్కడ కూడా మంచి సక్సెస్ సాధించాయి.
పొలిటికల్ ఎంట్రీ
ఒకవైపు సినిమాల్లో స్టార్ ఇమేజ్ ఉన్న విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తమిళ రాజకీయాల్లో ఒక కీలకపాత్రను పోషిస్తున్నారు అని చెప్పాలి. విజయ్ పొలిటికల్ స్పీచెస్ కి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. విజయ్ పెట్టిన పొలిటికల్ మీటింగ్స్ కి భారీ స్థాయిలో ప్రజలు కూడా హాజరవుతున్నారు. ఇక ప్రస్తుతం “జననాయగన్” అనే సినిమాను చేస్తున్నాడు విజయ్. హెచ్ వినోద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
Also Read : Lokesh Kanagaraj: సూర్యతో సినిమా ఉంది, కానీ నేను ఇప్పుడు మొదలు పెట్టేది ఇదే
దయచేసి చాలా చేయకండి
ఇక విజయ్ రీసెంట్ గా మధురైలో ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఆ ప్రెస్ మీట్ లో ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ… నేను జననాయగన్ షూటింగ్ కోసం వెళుతున్నాను, మళ్లీ పొలిటికల్ పనులు కోసం మధురై కి వస్తాను. నేను వెళ్తున్నప్పుడు దయచేసి వ్యాన్ వెనుక నన్ను ఫాలో చేయకండి. అలానే స్పీడ్ గా బైక్స్ డ్రైవ్ చేయకండి. హెల్మెట్ లేకుండా ప్రయాణాలు అసలు చేయొద్దు అంటూ అభిమానులకు సూచనలు అందించాడు తలపతి విజయ్. మామూలుగా ఇలాంటి విషయాలను పెద్దగా స్టార్ హీరోలు పట్టించుకోరు. వాళ్ళు ఎలానో ఫాలోయింగ్ కోరుకుంటారు. వీటన్నింటి మధ్యలో కూడా వాళ్లకు జాగ్రత్త చెబుతున్నారు అంటే ఇది నిజంగా విజయ్ వ్యక్తిత్వమా.? లేదంటే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి నటిస్తున్నాడా అంటూ కొంతమంది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.
Also Read : Mahesh Babu : రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది ఆ డైరెక్టరకే