E-Paper
Advertisement

Saripodhaa Sanivaaram: నాని యాక్టింగ్ ఇరగదీసేశాడు.. వీడియో అదిరిపోయిందంతే..

Saripodhaa Sanivaaram: నాని యాక్టింగ్ ఇరగదీసేశాడు.. వీడియో అదిరిపోయిందంతే..
Advertisement

Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని కొత్త దర్శకులను పరిచయం చేయడంలో ముందుంటాడు. ఒకే ఒక్క అవకాశం కోసం చూస్తున్న దర్శకులకు ఛాన్స్ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నాడు. ఇక కొత్త దర్శకులు కూడా నాని నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలుగు ప్రేక్షకుల మైండ్‌సెట్‌కు అనుగుణంగా డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు తెరకెక్కించి మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు.

గతేడాది ఏకంగా ఇద్దరు కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాడు. అందులో ఒకటి ‘దసరా’ మూవీ. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా సినీ ప్రేక్షకాభిమానుల్ని కట్టిపడేసింది. భారీ అంచనాలతో తెరకెక్కి కలెక్షన్ల వర్షం కురిపించింది. నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా దసరా నిలిచింది. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అదరగొట్టేసింది. దీంతో అటు నాని పేరు.. ఇటు దర్శకుడి పేరు మారుమోగిపోయింది.

Advertisement

 Also Read: ఎంత ‘ఉల్లాసం’గా ఉంది ఈ పాట.. నాని మెలోడీస్ లిస్ట్ లో మరొకటి

ఆ తర్వాత మరో కొత్త దర్శకుడు శౌర్యువ్‌కి ఛాన్స్ ఇచ్చాడు. అతడు కూడా నాని నమ్మకాన్ని నిలబెట్టి సినిమాను హిట్ దిశగా నడిపించాడు. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద అదిరిపోయే కలెక్షన్లను నమోదు చేసింది. ఇందులో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించి అదరగొట్టేసింది.

Advertisement

అయితే ఇప్పుడు నాని మరోక కొత్త సినిమాతో వస్తున్నాడు. గతంలో నాని – వివేక్ ఆత్రేయ కాంబోలో ‘అంటే సుందరానికి’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్ అందుకుంది. కానీ నాని దిగులు పడకుండా మరోసారి ఆ దర్శకుడికే అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం నాని – వివేక్ ఆత్రేయ కాంబోలో ‘సరిపోదా శనివారం’ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఇవాళ నటుడు ఎస్ జే సూర్య బర్త్ డే సందర్భంగా ‘నాట్ ఏ టీజర్’ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో నాని, ఎస్ జే సూర్య యాక్టింగ్ అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×