BigTV English

RBI Grade-B Recruitment | రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగ ఖాళీలు.. గ్రేడ్ బి పోస్టుల కోసం గ్రాడుయేట్స్ అప్లై చేసుకోవచ్చు!

RBI Grade-B Recruitment | రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగ ఖాళీలు.. గ్రేడ్ బి పోస్టుల కోసం గ్రాడుయేట్స్ అప్లై చేసుకోవచ్చు!

RBI Grade-B Recruitment| బ్యాంకు ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు దేశ రిజర్వ్ బ్యాంకు ఒక శుభవార్త తెలిపింది. రిజర్వ్ బ్యాంకు లో గ్రేడ్ బి ఆఫీసర్ల 94 పోస్టుల ఖాళీలను భర్తీ చేయడానికి ఆర్‌బిఐ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. ఆఫీసర్ గ్రేడ్ బి జెనరల్, ఆఫీసర్ గ్రేడ్ బి డిఈపీఆర్, ఆఫీసర్ గ్రేడ్ బి డియస్ఐఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాల కోసం పరీక్ష రాయాలనుకున్నవారు opportunities.rbi.org.in వెబ్ సైట్ లో ఉద్యోగం కోసం అప్లై చేసుకోవచ్చు.


ఈ ఉద్యోగాలు గురించి వయసు పరిమితి, విద్యార్హతత, ఉద్యోగ బాధ్యతలు, అప్లికేషన్ ప్రక్రియను వివరంగా తెలుసుకోండి.

RBI Grade-B Recruitment 2024
విద్యార్హత: ఆఫీసర్ గ్రేడ్ బీ ఉద్యోగం పొందడానికి అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. డిగ్రీలో 60 శాతం మార్కులు తప్పనిసరి. మిగతా పోస్టుల కోసం అఫీషియల్ వెబ్ సైట్ (క్లిక్ చేయండి- https://opportunities.rbi.org.in/Scripts/Vacancies.aspx)లో వివరాలు చూడండి.


వయసు పరిమితి
రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన వివిధ ఉద్యోగాలకు ఒక వయో పరిమితి నిర్ధారించింది. అభ్యర్థి వయసు కనీసం 21 ఏళ్లు.. గరిష్ఠంగా 30 సంవత్సరాల ఉండాలి.

RBI Grade-B Recruitment 2024 అప్లికేష్ ఫీజు వివరాలు:
జెనరల్ క్యాటగిరీ అభ్యర్థులు – రూ.850
ఓబీసి అభ్యర్థులు – రూ.850
(ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు – రూ.850
షెడ్యూల్డ్ క్యాస్ట్ (దళితులు) – రూ.100
షెడ్యూల్డ్ ట్రైబ్ (ఆదివాసీలు) – రూ.100
దివ్యాంగులు – రూ. 100

RBI Grade-B Recruitment 2024 – ఉద్యోగ ఖాళీలు
ఆఫీసర్ గ్రేడ్ బి జెనరల్ – 66 పోస్టులు
ఆఫీసర్ గ్రేడ్ బి డిఈపీఆర్ – 21 పోస్టులు
ఆఫీసర్ గ్రేడ్ బి డియస్ఐఎం – 07 పోస్టులు

Also Read: కొలువుల జాతర.. టెన్త్ అర్హతతో పోస్టల్ శాఖలో 44,228 ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలంటే..?

RBI Grade-B Recruitment 2024 అప్లై చేయండి ఇలా..
-ఉద్యోగ అర్హత పరీక్ష రాయడానికి అఫీషియల్ వెబ్ సైట్ opportunities.rbi.org.in లో వెళ్లండి.
– అందులో హోం పేజీ పై RBI Grade-B Recruitment 2024 అని లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి
– అక్కడ మీ గురించిన సమాచార వివరాలు పూర్తిగా నింపండి
– అవసరమైన డాకుమెంట్ కాపీలను స్కాన్ చేసి వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయండి
– అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి.. అప్లికేషన్ ఫీజుని ఆన్ లైన్ పద్ధతిలో చెల్లించండి
– అప్లికేషన్ విజయవంతంగా నింపిన తరువాత దాని కాపీ డౌన్ లోడ్ చేసుకోండి.

Tags

Related News

Jobs in LIC: డిగ్రీ అర్హతతో ఎల్ఐసీలో ఉద్యోగాలు.. ఉద్యోగ ఎంపిక విధానం ఇదే.. డోంట్ మిస్

ఇంటర్, డిగ్రీతో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే 62వేల జీతం.. ఇంకెందుకు ఆలస్యం..?

BSF Police Jobs: భారీగా పోలీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు భయ్యా

LIC Notification: ఎల్ఐసీలో 491 ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. రూ.1,69,025 వేతనం

BSF Jobs: బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు

Indian Railway: రైల్వేలో 2418 ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా ఉద్యోగ నియామకం

Big Stories

×