E-Paper
Advertisement

K Rajan: కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. సీనియర్ నిర్మాత కె. రాజన్ ఆత్మహత్య!

K Rajan: కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. సీనియర్ నిర్మాత కె. రాజన్ ఆత్మహత్య!
Advertisement

K Rajan: తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తన ముక్కుసూటి ప్రసంగాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రముఖ తమిళ సీనియర్ సినీ నిర్మాత కె. రాజన్ (85) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కోలీవుడ్ వర్గాలతో పాటు చిత్ర అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Read also-‘కరుప్పు’ డబ్బింగ్ నాకు ‘లియో’ వివాదాన్ని గుర్తుచేసింది.. గాయని చిన్మయి ఎమోషనల్..

నదిలోకి దూకి..

Advertisement

పోలీసుల సమాచారం ప్రకారం.. చెన్నైలోని అడయార్ వంతెన పైనుంచి కె. రాజన్ నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, నది నుంచి ఆయన మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ వయసులో ఆయన ఇంతటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా లెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానం

కె. రాజన్ 1980ల కాలం నుండి తమిళ చిత్ర పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 1983లో నటుడు సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘బ్రహ్మచారిగళ్’ చిత్రంతో ఆయన నిర్మాతగా కెరీర్ ప్రారంభించారు. తన ‘గణేష్ సినీ ఆర్ట్స్’ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించారు. కేవలం నిర్మాణానికే పరిమితం కాకుండా.. అబ్బాస్, కునాల్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘ఉణర్చీగళ్’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. ఆయన కుమారుడు ప్రభుకాంత్ కూడా కోలీవుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా కొనసాగుతున్నారు.

Advertisement

Read also-విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ముక్కుసూటి మనిషి

సినిమా ఫంక్షన్లు, ఆడియో లాంచ్‌లలో కె. రాజన్ స్టేజ్ ఎక్కారంటే అందరిలోనూ ఒకటే ఆసక్తి ఉండేది. పరిశ్రమలో ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా, డైరెక్టర్ అయినా సరే.. తప్పు ఉంటే ముఖం మీదే మాట్లాడటం ఆయన నైజం. ముఖ్యంగా చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, థియేటర్ల సమస్యలపై నిరంతరం గళమెత్తేవారు. నటీనటులు తీసుకునే భారీ రెమ్యునరేషన్ల వల్ల నిర్మాతలు ఎలా రోడ్డున పడుతున్నారో బహిరంగంగానే విమర్శించేవారు. సినీ ఇండస్ట్రీలో జరిగే అక్రమాలను, సిండికేట్లను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచేవారు.

85 ఏళ్ల వయసులో, ఎంతో అనుభవమున్న ఒక సీనియర్ సినీ పెద్ద ఇలాంటి విషాదకర రీతిలో ప్రాణాలు కోల్పోవడం పట్ల కోలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు ఆయన భౌతికకాయానికి నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Related News

రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ‘ఉపేంద్ర’ మూవీ!

ఈ స్పీడ్ ఏంటి రవితేజా.. ఇరుముడి తర్వాత జోరు పెంచాడుగా !

67 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అంటూ ట్రోలింగ్.. నీనా గుప్తా దిమ్మతిరిగే కౌంటర్!

నా భార్య నన్ను నమ్మింది… సైమా అవార్డుతో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

సెప్టెంబర్ 18న వచ్చేస్తున్న’పిఠాపురంలో అలా మొదలైంది’!

బేబీబంప్ తో రష్మిక మందన్న…రణబాలి నుంచి స్పెషల్ వీడియో!

తారక్ నెక్ట్స్ సినిమాలు ఇవేనా.. ఒక్కొక్కటి మామూలు కాంబో కాదుగా !

సూరితో పోటీగా సుహాస్ క్రేజ్.. తమిళనాట మండాడి హంగామా!

Big Stories

Advertisement
×