BigTV English

Nayantara : న‌య‌న‌తార షాకింగ్ నిర్ణ‌యం

Nayantara : న‌య‌న‌తార షాకింగ్ నిర్ణ‌యం

Nayantara : సౌత్ లేడీ సూప‌ర్‌స్టార్ ఇమేజ్‌తో క్రేజీ ప్రాజెక్ట్స్‌లో న‌టిస్తోన్న న‌య‌న‌తార రీసెంట్‌గా తీసుకున్న నిర్ణ‌యం అంద‌రికీ షాకింగ్‌కు గురి చేస్తుంద‌ట‌. ఇంత‌కీ ఆమె అంతలా ఏ నిర్ణ‌యం తీసుకుంది. ఎందుకు తీసుకుంది? అనే వివ‌రాలు తెలియాలంటే కాస్త లోప‌లికి వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని రోజుల ముందు కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ హీరోగా రూపొందనున్న 62వ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వ‌చ్చింది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొంద‌బోయే ఈ చిత్రానికి న‌య‌న్ భ‌ర్త విఘ్నేష్ శివ‌న్‌ను ద‌ర్శ‌కుడిగా ప్ర‌క‌టించారు.


అయితే కొన్ని రోజుల త‌ర్వాత ప్రాజెక్ట్ నుంచి విఘ్నేష్ శివ‌న్ సైలెంట్‌గా త‌ప్పుకున్నాడు. అందుకు కార‌ణం అజిత్ కుమార్ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేయ‌మ‌ని సూచించార‌ట‌. కానీ దానికి విఘ్నేష్ శివ‌న్ ఒప్పుకోలేదు. దీంతో అజిత్ సూచ‌న మేర‌కు లైకా ప్రొడ‌క్ష‌న్స్ … విఘ్నేష్ శివ‌న్‌ను ప్రాజెక్ట్ నుంచి త‌ప్పించారు. రంగంలోని న‌య‌న‌తార దిగి అజిత్‌ను ఒప్పించే ప్ర‌య‌త్నం చేసినా ఆయ‌న ఒప్పుకోలేద‌ట‌.

ఈ విష‌యంపై న‌య‌న‌తార మ‌న‌సు నొచ్చుకుంది. దీంతో ఆమె ఇక‌పై అజిత్ కుమార్ సినిమాల్లో న‌టించ‌కూడ‌ద‌నే నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు వార్తలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. న‌య‌న‌తార ఈ ఏడాది జూన్‌లో విడుద‌ల‌వుతున్న జ‌వాన్ సినిమాతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు మరి కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లోనూ నయనతార నటిస్తోన్న సంగతి తెలిసిందే.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×