Nayanthara : లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార (Nayanthara) జీవిత కథ ఆధారంగా.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఈ డాక్యుమెంటరీలో నయనతార గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పటివరకు ఆమె సినీ కెరియర్ పై, వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఎన్నో రూమర్స్ కి ఇందులో క్లారిటీ ఇచ్చింది నయనతార. ఇకపోతే నవంబర్ 18న నయనతార 40వ పుట్టిన రోజును జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె వివాహా జీవిత ప్రయాణం గురించి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీని విడుదల చేసింది. దీనికి దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు.
అతడి వల్లే సినిమాలకు దూరమయ్యా…
ఇకపోతే నయనతార కెరియర్ పరంగా కంటే వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అలాంటి వాటిలో ప్రభుదేవా (Prabhudeva)తో రిలేషన్.. ఈ నేపథ్యంలోనే ప్రభుదేవాతో రిలేషన్ గురించి, అలాగే ఆ రిలేషన్ లో తాను పడ్డ ఇబ్బందుల గురించి తెలిపి అందరిని ఆశ్చర్యపరిచింది నయనతార. నయనతార మాట్లాడుతూ.. “సినీ కెరియర్ లో ఉన్నతంగా బ్రతకాలని కోరుకున్న నేను. సడన్గా సినిమాలు మానేయడానికి కారణం నేను కాదు అతడే.. నేను ఎప్పుడూ సినిమాలకు దూరంగా ఉండాలని కోరుకోలేదు. కానీ ఆ వ్యక్తి ఒక మాటలో.. ఇక నువ్వు నటించకూడదని? చెప్పాడు. ఎందుకంటే ఆ సమయంలో అతడే నాకు చాలా గొప్పగా అనిపించాడు. ఇక జీవితాన్ని అర్థం చేసుకునే అంత శక్తి నాకు లేదు. అందుకే అతడు చెప్పినట్టుగానే సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్నాను” అంటూ పరోక్షంగా ప్రభుదేవా పై కామెంట్లు చేసింది నయనతార.
ప్రభుదేవా తో బ్రేకప్..
ఇకపోతే నయనతారతో ప్రభుదేవా రిలేషన్ లో ఉన్నప్పుడు.. ఈయనకు అప్పటికే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక తనను పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చుకోవాలని కూడా సూచించారట ప్రభుదేవా. ఈ క్రమంలోనే ఒక క్రిస్టియన్ అయిన నయనతార హిందువుగా మారింది. ఇక ప్రేమించిన వాడి కోసం ఎన్నో త్యాగాలు చేసిన నయనతార చివరికి వివాహం చేసుకునే సమయంలో.. ప్రభుదేవా భార్య ఎంట్రీ ఇవ్వడంతో అసలు కథ మలుపు తిరిగింది. ఇక ఆమె నయనతార వల్ల తన భర్త తనకు, తన పిల్లలకు దూరం అవుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీంతో ప్రభుదేవా నుంచి నయనతార దూరం అయింది.
విఘ్నేష్ శివన్ తో ప్రేమ, పెళ్లి…
ఇక అప్పటినుంచి ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తూ.. కెరియర్ పైన దృష్టి పెట్టిన ఈమె.. ఆ తర్వాత ఒక సినిమా షూటింగ్ సెట్లో ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. అతడితో ప్రేమలో ఉండి, అతడి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే అతడిని వివాహం చేసుకుంది నయనతార. అలాగే సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలు కూడా జన్మనిచ్చారు. ఇక ప్రస్తుతం నయనతార సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది.