Tea Stains Removal: ప్రతి ఒక్కరికి రోజూ టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కొన్ని సార్లు టీ తాగేటప్పుడు, లేదా ఎవరికైనా ఇస్తున్నప్పుడు, లేదా తీసుకుంటున్నప్పుడు బట్టలపై పడుతుంటాయి. దీంతో ఆ మరకలు అనేవి దుస్తులపై ఉండిపోతాయి. ఆ మరకలు తొలగించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది ఉప్పు, నిమ్మకాయ వేసి రుద్దుతుంటారు. దీనివల్ల మరకలు పోవడం పక్కనపెడితే.. బట్టలపై ఆ ప్రదేశంలో వెలిసిపోయినట్లు కనిపిస్తుంది. కాబట్టి ఈ సింపుల్ చిట్కాలు పాటించారంటే టీ మరకలు ఇట్టే తొలగిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో మీరు చూసేయండి.
బేకింగ్ సోడాతో మరకలు తొలగించండి..
బేకింగ్ సోడాను సాధారణంగా అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తుంటారు. అయితే దీంతోటి బట్టలపై మరకలు కూడా తొలగిపోతాయట. ఎలా అంటే.. టీ లేదా కాఫీ పడిన చోట కొంచెం బేకింగ్ షోడా వేసి నెమ్మదిగా చేత్తో రుద్దాలి. ఐదు నిమిషాల తర్వాత బట్టలను వాష్ చేస్తే మరకలు ఇట్టే తొలగిపోతాయి.
వేడి నీటితో తొలగించండి ఇలా..
సాధారణంగా కాటన్ దుస్తులపై టీ మరకలు పడితే పోవడం చాలా కష్టం. అలాంటప్పుడు ఎక్కడైతే టీ మరకలు ఉన్నాయో ఆ ప్రదేశంలో కాస్త వేడినీటిని పోసి వాష్ చేస్తే సరి.. మరక తొలగిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి.. బాగా వేడినీళ్లను ఉపయోగించకూడదు.. బట్టలు నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది.
వెనిగర్ మరకలను తొలగించండి ఇలా..
బట్టలపై టీ మరకలు తొలగించేందుకు వెనిగర్ అద్బుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఒక గ్లాసు నీళ్లల్లో రెండు టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో వేసి మరక పడిన చోట స్ప్రే చేయాలి. అరగంట తర్వాత వాష్ చేస్తే టీ మరకలు మాయం అవుతాయి.
Also Read: హెన్నాలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జన్మలో తెల్లజుట్టు రాదు
టూత్ పేస్ట్‌తో మరకను తొలగించండి..
బట్టలపై మరకలను తొలగించేందుకు టూత్ పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. ఇందుకోసం టీ మరకలు పడిన చోట పేస్ట్‌ని పూసి 10 నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత వాటర్‌తో కడిగేస్తే.. మరకలు తొలగిపోతాయి.
ఇలా కూడా మరకలు తొలగించవచ్చు..
టీ మరకలు పడినప్పుడు వెంటనే వాటర్‌తో వాష్ చేస్తే సులభంగా తొలగిపోతుంది. లేదు అంటే నీటిలో డిటర్జెంట్ వేసి కొంచెం సేపు నానబెట్టి ఆతర్వాత మునివేళ్లతో రుద్ది.. నీటితో వాష్ చేస్తే.. మరకలు అనేవి తొలగిపోతాయి.
మరకలు తొలగించేందుకు బంగాళదుంపలను కూడా ఉపయోగించవచ్చు.. ఇందుకోసం బంగాళ దుంపలను నీటిలో ఉడకనివ్వాలి. ఆ తర్వాత నీటిలో టీ మరకలు పడిన దుస్తులు వేసి 20ల పాటు నానబెట్టి వాష్ చేసిన మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.