E-Paper
Advertisement

Nayanthara: స్టార్ హీరో సినిమాలో ఆ పాత్ర.. ఊహించని రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నయనతార!

Nayanthara: స్టార్ హీరో సినిమాలో ఆ పాత్ర.. ఊహించని రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నయనతార!
Advertisement

Nayanthara new film updates(Tollywood news in telugu): సీనియర్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన నటి నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది సీనియర్ స్టార్ హీరోలతో జోడి కట్టి మంచి హిట్లను అందుకుంది. ఇప్పటికీ తరగని అందం, అభినయంతో పలు సినిమాలతో దూసుకుపోతుంది. యంగ్ హీరోల సరసన నటించి అదరగొడుతుంది. అంతేకాకుండా ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతో దూసుకుపోతుంది.

ఎంత వయసు పెరిగినా.. ఆమె అందం మాత్రం చెక్కు చెదరకుండా అభిమానులను ఆకట్టుకుంటుంది. కోలీవుడ్, టాలీవుడ్ లోనే కాకుండా మరికొన్ని భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే గతేడాది బాలీవుడ్ బాద్షా నటించిన ‘జవాన్’ మూవీలో హీరోయిన్‌గా అదరగొట్టేసింది. దీంతో బాలీవుడ్‌లో కూడా తనదైన ముద్ర వేసుకుంది.

Advertisement

ప్రస్తుతం ఈ బ్యూటీ మూడు, నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అందులో ‘కేజీఎఫ్’ హీరో యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ ఒకటిగా తెలుస్తుంది. మలయాళ హీరోయిన్, డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో నటించే ఆఫర్‌ను నయన్ ఇటీవల సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Also Read: నయనతారా మజాకా.. 40 సెకన్ల యాడ్ కి రూ. 5 కోట్లు..?

Advertisement

అయితే ఈ మూవీలో యష్‌కు అక్క పాత్రలో నయన్ నటించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే ఇందులో ముందుగా అక్క పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ని మేకర్స్ అనుకున్నట్లు సమాచారం వచ్చింది. అయితే సడెన్‌గా ఆమెను కాదని ఆమె ప్లేస్‌లో నయనతారను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. కాగా ఈ అక్క పాత్ర కోసం నయన్ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ కోసం ఏకంగా రూ.15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు జోరుగా సాగుతున్నాయి. మరి ఇదే నిజమైతే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ల జాబితాలోకి నయన్ చేరిపోతుంది. అయితే కొందరికి ఇక్కడే ఓ డౌట్ కొడుతుంది.

హీరోయిన్‌గా బ్లాక్ బస్టర్ హిట్లతో అదరగొడుతున్న నయన్ ఇప్పుడు ఈ మూవీలో అక్క పాత్ర కోసం ఒప్పుకుంటుందా? అని చర్చించుకుంటున్నారు. మరికొందరేమో.. చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో కూడా చెల్లి పాత్రలో నటించారు కదా అని గుర్తు చేసుకుంటున్నారు. కాగా ఈ మూవీ అనౌన్స్‌మెంట్ టైంలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది 2025, ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×