BigTV English

Nayanthara Quotes ₹ 5 Crore for 40 Sec Ad: నయనతారా మజాకా.. 40 సెకన్ల యాడ్ కి రూ. 5 కోట్లు..?

Nayanthara Quotes ₹ 5 Crore for 40 Sec Ad: నయనతారా మజాకా.. 40 సెకన్ల యాడ్ కి రూ. 5 కోట్లు..?
Nayanthara Ad Remuneration
Nayanthara Ad Remuneration

Nayanthara Quotes Rs 5 Crore for 4 Seconds Ad: అది టీవీలో వచ్చే 40 సెకన్ల యాడ్.. సమ్మర్ వస్తోంది కదా.. కూల్ డ్రింక్ లకి యమా డిమాండ్ ఉంటుంది. దీంతో ఆ కార్పొరేట్ కంపెనీ తమ కూల్ డ్రింక్ ప్రమోషన్ కోసం.. హీరోయిన్ నయన తారను సంప్రదించింది.


తనెంత అడిగిందో తెలీదు, కానీ వాళ్లు మాత్రం రూ.5 కోట్లు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో ఈ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఏంటి? నయనతారకు అంత డిమాండా? అంటున్నారు.

అందరికీ అర్థం కాని విషయం ఏమిటంటే, తనిప్పుడు సౌత్ ఇండియన్ హీరోయిన్ కాదు.. బాలీవుడ్ బాద్ షాతో కలిసి జవాన్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేసింది. అది కూడా అలాంటి ఇలాంటి సినిమా కాదు, కంప్లీట్ యాక్షన్ సినిమా.. అంతేకాదు బ్లాక్ బస్టర్ అయ్యింది. ఒకరకంగా చెప్పాలంటే.. ఆ నయన తారకి పెద్ద అస్సెట్ అయ్యింది.


Also Read: ఆ సాంగ్ షూటింగు సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను: సమంత

కళ్లు తిప్పుకోలేని తన అందంతో ఉత్తరాది ప్రేక్షకులను కట్టి పడేసింది. అయితే మెయిన్ హీరో షారూఖ్ ఖాన్ ఉన్నా సరే, సమ ఉజ్జీగా ఉండాలి కదా. ఇదంతా ఎందుకంటే.. ఇప్పుడు నయనతార సౌత్ ఇండియన్ స్టార్ కాదు.. బాలీవుడ్ స్టార్.. ఇప్పుడు తను ఒక యాడ్ లో నటిస్తే, భారతదేశమంతా చూస్తుంది. అందువల్ల తనకి ఉన్న నేషనల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని డిమాండ్ చేసింది.

యాడ్ కంపెనీ వాళ్లు కూడా సరేనన్నారు. రూ. 5 కోట్లు ఇచ్చి యాడ్ చేసుకుని వెళ్లిపోయారు. అంతే, ఈ మాట నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతిశయోక్తి లేకపోవచ్చునని కొందరంటున్నారు. నయనతార ఒక సినిమాకి రూ.5 కోట్లు తీసుకుంటుందని సమాచారం. రజనీకాంత్ సినిమాల్లో నయనతార ఎక్కువగా నటిస్తుంది.

Also Read: ఓటీటీలోకి వచ్చేసిన హనుమాన్.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఎదురుచూపులే..

హీరోలందరూ సీనియర్లు అయిపోయారు. వారిపక్కన అంతా కుర్ర భామలే ఉన్నారు. వారు సెట్ కావడం లేదు. ఇప్పుడు వీరందరికి ఒక ఆప్షన్ నయనతార కనిపిస్తోంది. తనిప్పుడు సినిమాలతో చాలా బిజీగా ఉంది. జవాన్ రిలీజ్ కావడంతో తన రేట్ ని రూ.7 కోట్లకు పెంచిందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×