Big Stories

Rains: విషాదం.. వరద నీటిలో కొట్టుకుపోయి బాలుడు మృతి (వీడియో)

Texas flood news(Today’s international news): అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వరద నీటితో కనబడుతోంది. నదులు భారీగా పొంగిపొర్లుతున్నాయి. ప్రధానంగా హ్యూస్టన్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వీధులలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. అదేవిధంగా హ్యూస్టన్ నుండి గ్రామీణ తూర్పు టెక్సాస్ వరకు ఒక విశాలమైన ప్రాంతం కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.

- Advertisement -
Rains in Texas
Rains in Texas

వరదలు భారీగా ప్రవహిస్తుండడతో అక్కడి ప్రజలు ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. వరద నీరు భారీగా ఇళ్లలోకి చేరుకోవడంతో కొంతమంది ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టి సుమారు 400 మంది రక్షించినట్లు తెలుస్తోంది. వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరికను కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు సమాచారం.

- Advertisement -
Rains in US
Rains in US

అయితే, వరద నీరు భారీగా ప్రవహిస్తుండడంతో ప్రజలు ఎత్తైనా ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కారులో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు, వారి కుమారుడు వరద నీటిలో కొట్టుకుపోయారని, వారిని రక్షించడానికి రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఆ ఇద్దరు వ్యక్తులను కాపాడారని, అయితే, వారి కుమారుడు( ఐదేళ్ల బాలుడు) వరదలో కొట్టుకుపోయి మృతిచెందినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా పలు ప్రాంతాల్లో ఇండ్లు, వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టెక్సాస్ లోని పాఠశాలలను మూసివేసినట్లు సమాచారం. అదేవిధంగా పలు రహదారుల గుండా వరద నీరు ఇంకా ప్రవహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించినట్లు సమాచారం.

Also Read: విషాదం.. 11 ఆస్కార్ అవార్డులు అందుకున్న ప్రముఖ నటుడు మృతి

ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరదలు ఇళ్లను ముంచెత్తిన దృశ్యం, ఆ ఇళ్లల్లో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న దృశ్యాలు.. రహదారుల గుండా వరద నీరు, భారీగా పొంగిపొర్లుతున్నటువంటి నదుల దృశ్యాలను ఆ వీడియోలలో చూడొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News