E-Paper
Advertisement

Nazriya Nazim-Fahadh Faasil: ‘ఆవేశం’తో వందకోట్లు కొట్టి.. భార్యతో ఛిల్ల్ అవుతున్న ‘పుష్ప’ విలన్..! ఫోటో వైరల్

Nazriya Nazim-Fahadh Faasil: ‘ఆవేశం’తో వందకోట్లు కొట్టి.. భార్యతో ఛిల్ల్ అవుతున్న ‘పుష్ప’ విలన్..! ఫోటో వైరల్
Advertisement

Fahadh Faasil’s Avesham Movie Collects Rs 100 Crores: మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప తో ఫహద్ కు తెలుగులో సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఫహాద్ .. తాజాగా వెకేషన్ మోడ్ లోకి వెళ్లి భార్యతో ఛిల్ల్ అవుతున్నాడు. ఫహాద్ భార్య నజ్రియా కూడా హీరోయినే అన్న విషయం కూడా తెల్సిందే. తెలుగులో ఆమె అంటే సుందరానికీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేనప్పటికీ నజ్రియా నటనకు తెలుగు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. నజ్రియా, ఫహాద్ ది ప్రేమ వివాహం.

బెంగుళూరు డేస్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ తమ కెరీర్ లో బిజీగా మారారు. సినిమాల్లో నటించడమే కాకుండా నిర్మాణ రంగంలోకి దిగిన ఈ జంట మంచి హిట్ సినిమాలనే ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ మధ్య మలయాళంలో సూపర్ హిట్ సినిమా ప్రేమలు సినిమా నిర్మించింది ఈ జంటనే. ఇక ఈ మధ్య ఆవేశం సినిమాతో ఫహాద్ సైతం హీరోగా మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా వందకోట్ల క్లబ్ లో చేరి ఇండస్ట్రీ మొత్తాన్ని ఊపేసింది. ఈ హిట్ తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న ఈ జంట.. ఇదుగో ఇలా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Sundar C: టాలీవుడ్ డైరెక్టర్స్ నా సీన్స్ కాపీ చేశారు.. ఖుష్బూ భర్త సంచలన వ్యాఖ్యలు

సముద్రపు ఒడ్డున షర్ట్ లేకుండా ఫహాద్.. స్విమ్ సూట్ లో నజ్రియా నవ్వుతూ సెల్ఫీకి పోజ్ ఇచ్చారు. ఇక దీనికి ” ఇప్పుడు ఛిల్ల్ అవ్వు బేబీ” అంటూ భర్తను ఉద్దేశించి నజ్రియా క్యాప్షన్ పెట్టుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఫహద్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారాడు. త్వరలోనే పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ఈ సినిమాతో ఈ హీరో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×