BigTV English

Sundar C Comments on Tollywood: టాలీవుడ్ డైరెక్టర్స్ నా సీన్స్ కాపీ చేశారు.. ఖుష్బూ భర్త సంచలన వ్యాఖ్యలు!

Sundar C Comments on Tollywood: టాలీవుడ్  డైరెక్టర్స్ నా సీన్స్ కాపీ చేశారు.. ఖుష్బూ భర్త సంచలన వ్యాఖ్యలు!

Sundar C Made Sensational Comments on Tollywood Directors: సుందర్ సి గురించి తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. ఖుష్బూ గురించి అసలు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలతో నటించి మెప్పించిన ఖుష్బూ భర్తనే సుందర్ సి. ఆయన కోలీవుడ్ డైరెక్టర్ కూడా. హర్రర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకోవచ్చు. చంద్రకళ, కళావతి, యాక్షన్, అంతఃపురం లాంటి సినిమాలు చేసి తెలుగులో కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా సుందర్ సి.. నటించి, దర్శకత్వం వహించిన చిత్రం బాక్. తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 3 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన సుందర్.. తెలుగు, తమిళ్ భాషల్లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుందర్ సి.. తెలుగు డైరెక్టర్స్ గురించి సంచలనవ్యాఖ్యలు చేశాడు. తన సినిమాల నుంచి చాలామంది టాలీవుడ్ డైరెక్టర్స్ సీన్స్ ను కాపీ చేసారని ఆరోపించాడు. 2003 లో సుందర్ సి దర్శకత్వంలో ప్రశాంత్ హీరోగా విన్నర్ సినిమా చేశాను. దానికన్నా ముందు కొన్ని తెలుగు దర్శకుల సినిమాలు చూసాను.

చాలా సినిమాల్లో నా సినిమాల్లో ఉన్న సీన్స్ ను కాపీ చేశారు. కాపీ కాదు దొంగతనం చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీపై కోపం వచ్చింది. వెంటనే నేను కూడా తెలుగు సినిమాల నుంచి కొన్ని సీన్స్ ను కాపీ కొట్టాలని నిర్ణయించుకొని ఆ విషయాన్నీ ప్రశాంత్ కు చెప్పాను. వెంటనే తెలుగు సినిమాలు డీవీడీలు పది ఇచ్చి ఇదే మన సినిమా అన్నాడు. అందులో వడివేలుతో ఒక సీన్ చేస్తే.. దాన్ని కూడా తెలుగువారు కాపీ కొట్టినట్లు చెప్పాడు. తనకు వారిలా కాపీ కొట్టడం రాదనీ చెప్పుకొచ్చాడు.


Also Read: Krish Jagarlamudi: హరిహర వీరమల్లు.. క్రిష్ తప్పుకున్నాడా.. ? తప్పించారా.. ?

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ సంచలనం సృష్టిస్తున్నాయి. సుందర్ మరీ ఇంత దారుణంగా టాలీవుడ్ డైరెక్టర్స్ పై నిందలు వేయడం అస్సలు బాగోలేదని తెలుగు అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×