Big Stories

Hitman Birthday celebrations: రోహిత్ బర్త్‌డే.. సెలబ్రేషన్స్, వైజాగ్ మూలాలు

Hitman Birthday celebrations:  టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ.. పెద్దగా పరిచయం అక్కర్లేదు. క్రికెట్ అభిమానులు ఆయన్ని ముద్దుగా హిట్‌మ్యాన్ పిలుచుకుంటారు. క్రికెట్ గ్రౌండ్‌లోకి దిగాడంటే చాలు ప్రేక్షకుల ఆనందం అంతాఇంతా కాదు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఆడుతాడు. అభిమానులు ఆ విధంగా ఎంజాయ్ చేసేలా తన బ్యాట్‌కు పని చెబుతాడు. ఏప్రిల్ 30న రోహిత్‌శర్మ బర్త్ డే. ఇవాళ్టితో 36 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

- Advertisement -

ఈ సందర్భంగా రోహిత్‌శర్మ గురించి కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని నాగపూర్‌లో జన్మించాడు రోహిత్‌శర్మ. తల్లి పూర్ణిమశర్మ విశాఖపట్నానికి చెందినవారు. సింపుల్‌గా ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు మూలాలున్న వ్యక్తి హిట్‌మ్యాన్. పెద్దగా తెలుగు మాట్లాడడం రాదు. 1999లో తొలిసారి బ్యాట్ పట్టిన రోహిత్, మరో ఏడేళ్ల తర్వాత జాతీయ జట్టులో చోటు సంపాదించాడు.

- Advertisement -

టెస్టు, వన్డే, టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలో కలిసి 18 వేల పైచిలుకు పరుగులు చేశాడు రోహిత్‌శర్మ. టెస్టుల్లో 4 వేలు, వన్డేల్లో 10వేలు, టీ20 మ్యాచ్‌ల్లో 3974 పరుగులు చేశాడు. అంతేకాదు 48 సెంచరీలు నమోదు చేశాడు. అంతేకాదు 597 సిక్సర్లు బాదిన రికార్డు కూడా ఆయన సొంతం. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. ఆరున్నర వేలకు పైగా పరుగులు చేశాడు.

ALSO READ: టీ 20 వరల్డ్ కప్ నుంచి.. హార్దిక్ అవుట్?

ఐసీసీ వరల్డ్ కప్‌లో ఐదు సెంచరీలు చేసిన ఘనత హిట్ మ్యాన్ సొంతం. మరో నెల తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ రానుంది. ఇందులో జట్టును ఎలా గెలిపిస్తాడనేది ఆసక్తి రేపుతోంది. ఇందుకోసం సరైన టీమ్ కోసం కసరత్తు చేస్తున్నాడు. యువ ఆటగాళ్లను ఈసారి జట్టులోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీలో బిజీగా ఉన్నా హిట్‌మ్యాన్.. తోటి ఆటగాళ్లు మాత్రం రోహిత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే, కేక్‌లు కట్ చేసి విషెష్ చెబుతున్నారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News