Samantha Derss : సమంత (Samantha).. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని, హీరో రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఒకప్పుడు తెలుగు చిత్రాలకే పరిమితమైన ఈమె ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోయింది. ఎక్కువగా బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు చేస్తూ బాలీవుడ్ కి పరిమితమైంది. ఇక త్వరలోనే ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు హీరోయిన్ గానే కాదు మరొకవైపు నిర్మాత కూడా.. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ‘ బ్యానర్ ను స్థాపించి, తన సొంత నిర్మాణంలోనే ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. ఈ సినిమా మే తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.
సమంత డ్రెస్ చూశారా.. మొత్తం చూపించేసిందిగా..
ఇదిలా ఉండదా నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకున్న ఈమె.. అనూహ్యంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. లేనిపోని నిందలు భరించింది. అంతేకాదు మయోసైటిస్ వ్యాధి బారిన పడి పూర్తిగా మారిపోయింది సమంత. అయితే చాలా రోజుల తర్వాత మరింత సంతోషంగా ట్రెండీగా కనిపించి, పాత సమంతాను గుర్తు చేసింది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదికగా ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమంత ఎన్ని రోజులు ఎక్కడికి పోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2025లో భాగంగా బ్రౌన్ కలర్ టైట్ అవుట్ ఫిట్ ధరించి ఆకట్టుకుంది. ఇక ఈ డ్రెస్ ను సైడ్ లో జిగ్ జాగ్ షేప్లో శరీరం మొత్తం కనిపించేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ మళ్ళీ సామ్ ఈజ్ బ్యాక్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సమంత కెరియర్..
నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత మయోసైటీస్ వ్యాధి బారిన పడింది సమంత. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఆఖరికి విదేశాలలో కూడా ఈ సమస్యకు చికిత్స తీసుకుంది. ఇక మయోసైటిస్ ట్రీట్మెంట్ తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయినా సరే అభిమానులను ఆకట్టుకోవడానికి యశోద, శాకుంతలం, ఖుషి వంటి చిత్రాలు చేసి ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమైన ఈమె మళ్ళి కం బ్యాక్ లో గట్టి యాక్షన్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిటాడెల్ – హనీ బన్నీ వెబ్ సిరీస్ తో తన టాలెంట్ ఏంటో నిరూపించిన ఈమె ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. దీంతోపాటు మా ఇంటి బంగారం అనే సినిమాలో కూడా చేస్తోంది. మొత్తానికైతే మళ్లీ పాత సమంతను ఇప్పుడు తెరపై చూడడానికి అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇంక ముందు నిర్మాతగా, హీరోయిన్ గా మరింత సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నారు.
ALSO READ: Naga Chaitanya: నువ్వు మామూలోడివి కాదయ్యో..9వ తరగతిలోనే ఆ రుచి చూశావంటే..?
Our cutie @Samanthaprabhu2’s recent ♥️#Samantha • #SamanthaRuthPrabhu pic.twitter.com/xC7sBjxJ4Y
— Chennai Samantha Fans (@Chennai_SamFans) May 26, 2025