Naga Chaitanya:అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya).. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. పలు చిత్రాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు క్రియేట్ చేసుకున్నారు. కానీ స్టార్ హీరోగా మాత్రం ఎదగలేకపోయారు. అయితే వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మొదట ‘ఏ మాయ చేసావే’ సినిమాలో తనతో పాటు నటించిన హీరోయిన్ సమంత (Samantha) తో ప్రేమలో పడ్డారు. ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత ఆమెను వివాహం చేసుకున్నారు. అనూహ్యంగా నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇక రెండేళ్లు గ్యాప్ తీసుకున్న నాగచైతన్య.. మళ్లీ ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల (Shobhita dhulipala)తో ప్రేమలో పడ్డారు. గతేడాది ఆమెను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒకవైపు సినిమాలు మరొకవైపు షోయూ బిజినెస్ రెస్టారెంట్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉండగా తాజాగా నాగచైతన్యకు సంబంధించిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే తొమ్మిదవ తరగతిలోనే ఆ ఎక్స్పీరియన్స్ చేశానని, ఆ తర్వాత మళ్లీ అలాంటి అనుభూతి కలగలేదని చెప్పడంతో ఇప్పుడు నాగచైతన్యపై ఒక వర్గం వారు ట్రోల్స్ చేస్తున్నారు.
9వ తరగతిలోనే ఆ ఎక్స్పీరియన్స్ చేశా..
అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో ఒక టాక్ షోలో పాల్గొన్న నాగచైతన్యకు మీ మొదటి ముద్దు ఎప్పుడు ఇచ్చారు అనే ప్రశ్న ఎదురవగా.. ఆయన మాట్లాడుతూ.. 9వ తరగతిలో ఉన్నప్పుడే ఒక అమ్మాయికి నా మొదటి ముద్దు ఇచ్చాను. అది జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం” అంటూ నాగచైతన్య తెలిపారు. ఇక నాగచైతన్య ఈ మాట చెప్పడంతో ఇది విన్న నెటిజన్స్..నువ్వు మామూలోడివి కాదయ్యో..9వ తరగతిలోనే ఆ రుచి చూశావంటే..? అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇలాంటి మధుర జ్ఞాపకాలు సమంతాతో ఏవీ లేవా? అని సమంత అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది శోభిత ధూళిపాల అభిమానులు ఇటు శోభితతో కూడా నీకు ఆ ఎక్స్పీరియన్స్ కలగలేదా? అంటూ ఇలా ఎవరికి తోచిన వారు ఆ ఇద్దరు హీరోయిన్లతో జతకడుతూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం నాగచైతన్యకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నాగ చైతన్య కెరియర్..
ఇక నాగచైతన్య విషయానికి వస్తే.. నాగార్జున మొదటి భార్య దగ్గుబాటి లక్ష్మి, నాగార్జున దంపతులకు 1986 నవంబర్ 23న నాగ చైతన్య జన్మించారు. నాగచైతన్య జన్మించాక కొద్ది రోజులకు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరు విడిపోయారు. ఆ తర్వాత దగ్గుబాటి లక్ష్మి ఇంకొకరిని వివాహం చేసుకోగా.. నాగార్జున అమల (Amala)ను వివాహం చేసుకున్నారు. ఇకపోతే ‘జోష్’ అనే సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టిన నాగచైతన్య.. ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏమాయ చేసావే’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక తర్వాత పలు చిత్రాలు నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. చివరిగా తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన ఖాతాలో మంచి విజయాన్ని వేసుకున్నారు. ఇక ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ తో పాటు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ALSO READ:Tollywood: ఒకే నెలలో హీరో – హీరోయిన్ పెళ్లి.. జంటగా మాత్రం కాదండోయ్..!