Haryana News: హర్యానాలోని పంచకుల ప్రాంతంలో పార్కింగ్ చేసిన కారులో ఏడుగురు మృతదేహాలు కనిపించాయి. ఆత్మహత్య పాల్పడిన వారంతా ఒకే కుటుంబంలోని సభ్యులు. అప్పుల బాధల వల్లే ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీనిపై పంచకుల పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ వ్యాపారి ప్రవీణ్ మిట్టల్. ఆయన వయస్సు సుమారు 42 ఏళ్లు ఉండవచ్చు. ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి హర్యానాలోని పంచకులలో బాగేశ్వర్ ధామ్‌లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆదివారం కార్యక్రమం ముగించుకున్నారు. తిరిగి సొంతూరు డెహ్రాడూన్‌కు వెళ్తున్నారు. మరి ఏం జరిగిందో తెలీదు.
పంచకులలోని సెక్టార్ 27లోని ఓ ఇంటి బయట లాక్ చేసిన కారులో మృతదేహాలు కనిపించాయి. ఒకే కారులో ఏడుగురి మృతదేహాలు లభ్యం కావడంతో సంచలనంగా మారింది. పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో వ్యాపారి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.
ఆ కుటుంబం కారులోనే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. భారీ అప్పులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 42 ఏళ్ల ప్రవీణ్ మిట్టల్, అతని భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. అలాగే మిట్టల్ తల్లిదండ్రులు ఉన్నారు. ఫోరెన్సిక్ టీమ్ కారు వద్దకు చేరుకుని వివరాలు సేకరించే పనిలో పడింది.
ALSO READ: పెళ్లిలో అతిథులపై హిజ్రాల దాడులు.. వరుడు కిడ్నాప్
ఘటన స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే అందులోని విషయాలు బయటకు వెల్లడించలేదు. దర్యాప్తులో వాటి గురించి వెల్లచడం కరెక్టు కాదని అధికారులు చెప్పారు. పంచకుల డీఎస్పీ హిమాద్రి కౌశిక్ మాట్లాడుతూ ఈ విషాద ఘటన స్థానికుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
పంచకుల పోలీసులు ఈ కేసును చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. దర్యాప్తు తర్వాతే ఈ కేసుకు సంబంధించి ఖచ్చితమైన కారణాలు బయటపడతాయని అన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రత్యక్ష సాక్షుల వెర్షన్ మరోలా ఉంది. ఓ కుటుంబమంతా కారులో ఉండడం తాను గమనించానని తెలిపాడు. కారు లోపల వారు ఇబ్బంది పడుతుండటం చూసి స్థానికులకు చెప్పినట్టు వివరించాడు. ఒకరిపై ఒకరు వాంతులు చేసుకున్నట్లు వెల్లడించాడు. తాను చూసే సమయానికి ఒకరు మాత్రమే ఊపిరి పీల్చుకుంటున్నారని, మిగిలిన వారంతా అపస్మారక స్థితిలో ఉన్నట్లు చెప్పాడు.
కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని స్థానికుల సాయంతో బయటకు తీస్తుండగా అందరం విషం తాగామని, ఐదు నిమిషాల్లో చనిపోతామని చెప్పిన మాటలను గుర్తు చేశాడు. తాము అప్పుల్లో మునిగిపోయామని అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పినట్టు తెలిపాడు. పోలీసులు అక్కడికి రావడం, అర గంట తర్వాత అంబులెన్స్ వచ్చిందని సదరు వ్యక్తి పేర్కొన్నాడు.
VIDEO | Panchkula, Haryana: Seven members of a family from Dehradun found dead inside a car. Police investigating the case.
DSP Panchkula Himadri Kaushik says, "Our forensic team has reached the spot. We are analysing… scanning the car thoroughly to know the reasons behind the… pic.twitter.com/IetVgT6ojz
— Press Trust of India (@PTI_News) May 27, 2025