BigTV English

Sobhita Dhulipalla: వివాదంలో హీరోయిన్.. కొంచెం కూడా బుద్ధిలేదంటు ఫైర్..?

Sobhita Dhulipalla: వివాదంలో హీరోయిన్.. కొంచెం కూడా బుద్ధిలేదంటు ఫైర్..?

Sobhita Dhulipalla: బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ శోభిత దూళిపాళ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ మధ్య ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది. గత ఏడాది ఈమె అక్కినేని వారింటి కోడలు అయ్యింది. అక్కినేని వారసుడు నాగ చైతన్య శోభిత ఇద్దరు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాతే బాగా వైరల్ అయింది. అలాంటి శోభిత సంక్రాంతి సందర్భంగా పెట్టినటువంటి ఒక పోస్టు విపరీతంగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆమె పెట్టిన పోస్ట్ ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభిత ధూళిపాళను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా జరిగింది. అయితే పెళ్లికి సంబంధించిన ఫోటోలు అక్కినేని ఫ్యామిలీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయ్యాయి. ధూళిపాళ ముంబైలో పెరిగిన కానీ తెలుగు సాంప్రదాయాన్ని పాటిస్తూ ఎప్పుడూ చీరకట్టులోనే కనిపిస్తూ ఉంటుంది.. కానీ కొన్నిసార్లు మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపిస్తుంది. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఆమె పోస్టు చేసిన ఫోటో లో అడ్డంగా బుక్కయింది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలో రెడ్ శారీలో అందంగా ఉండటం మాత్రమే కాదు. అద్దం ముందు సెల్ఫీ తీసుకుంటూ ఒక పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో నాగచైతన్య శోభిత కాళ్లకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ సంక్రాంతి సంబరాలు జరిగాయి అంటూ చెప్పుకొచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

మొన్నటివరకు పద్ధతికి చీర కట్టారే అన్నట్లు ఉన్న ఈమెకు ఇప్పుడు ట్రోల్స్ ఎదురవుతున్నాయి. ఆ ఫోటోలలో కాళ్లకు ఉన్న మెట్టెలను తీసివేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. తెలుగింట అడుగుపెట్టిన నువ్వు ఇలా రెండు నెలలు కాకముందే మెట్టెలు తీసేసావు అంటూ కామెంట్లు పెడుతూ తిడుతున్నారు. ఎంగేజ్ మెంట్, పెళ్లి వరకు సాంప్రదాయంగా కనిపించావు ఆ తర్వాత అన్ని గాలికి వదిలేసావా అంటూ మండి పడుతున్నారు. తాజాగా ఈ వార్తలపై శోభిత స్పందించినట్లు తెలుస్తుంది. సినిమా షూటింగ్ కారణంగా తీసేసినట్లు చెప్పినట్లు తెలుస్తుంది.. అందరిని క్షమాపణలు అడిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు బోల్డ్ సినిమాలకు గుడ్ బై వార్తలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే తెలుగు సినిమాలను అనౌన్స్ చేస్తుందని సమాచారం..


ఇక నాగ చైతన్య మాత్రం వరుస సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాడు. ఆ తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టారు. తండేల్ మూవీ సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ పై నాగ చైతన్య ఆశలు పెట్టుకున్నాడు. మరి మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×