BigTV English

OTT Movie : ఆయుధం పట్టకుండా యుద్ధం చేసే సైనికుడు… మిస్ కాకుండా చూడాల్సిన దద్దరిల్లే వార్ క్లైమాక్స్

OTT Movie : ఆయుధం పట్టకుండా యుద్ధం చేసే సైనికుడు… మిస్ కాకుండా చూడాల్సిన దద్దరిల్లే వార్  క్లైమాక్స్

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా సినిమాల వైపు చూస్తుంటారు మూవీ లవర్స్. అయితే కొన్ని సినిమాలు మంచి మెసేజ్ తో పాటు, కళ్ళు చెమ్మగిల్లే విధంగా కూడా చేస్తాయి. ఇటువంటి సినిమాలు మిస్ కాకుండా చూసినందుకు, ఆనందపడతారు మూవీ లవర్స్. యుద్ధంలో ఆయుధం పట్టకుండా, విజయానికి సహకరించే ఒక సైనికుడి కథతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

ఈ హాలీవుడ్ వార్ మూవీ పేరు ‘హ్యాక్సా రిడ్జ్‘ (Hacksaw Ridge). 2016 లో వచ్చిన ఈ మూవీకి మెల్ గిబ్సన్ దర్శకత్వం వహించారు. ఎలాంటి ఆయుధం తీసుకెళ్లడానికి నిరాకరించిన అమెరికన్ శాంతిపరుడు, పోరాట వైద్యుడు డెస్మండ్ డాస్ రెండవ ప్రపంచ యుద్ధం అనుభవాలపై ఈ మూవీని చిత్రీకరించారు. డాస్ ఒకినావా యుద్ధంలో డ్యూటీకి మించి సేవ చేసినందుకు, మెడల్ ఆఫ్ హానర్‌ను పొందిన మొదటి వ్యక్తి అయ్యాడు. ‘హ్యాక్సా రిడ్జ్’ నవంబర్ 4, 2016న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా $180 మిలియన్లు వసూలు చేసి, ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), ఆపిల్ టీవీ (Apple TV) లలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో ఒక ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. రక్తం బాగా పోతుండటంతో, కాలికి తన బెల్ట్ తో గట్టిగా కట్టు కడతాడు. అలా బ్లడ్ పోకుండా హాస్పిటల్ కి తీసుకురావడంతో ఆ వ్యక్తి బ్రతుకుతాడు. తరువాత అక్కడే పని చేసే ఒక నర్స్ ను ప్రేమిస్తాడు హీరో. ఆమెకు ప్రపోజ్ చేసి పెళ్లికూడా చేసుకుంటాడు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో అమెరికాకి, జపాన్ కి యుద్ధం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో హీరో సైన్యంలో జాయిన్ అవుతాడు. అక్కడ ట్రైనింగ్ లో గన్ పైరింగ్ చేయడానికి వెనకడుగు వేస్తాడు. ఎంతమంది చెప్పినా గన్ ముట్టుకోకపోవడంతో, అతన్ని సైన్యం నుంచి తొలగించాలనుకుంటారు. అయితే తండ్రి ఆర్మీలోనే మంచి పొజిషన్లో ఉండటంతో, హీరోని సైన్యం లో కొనసాగే విధంగా ఆర్డర్ తీసుకొస్తాడు. అక్కడున్న అధికారులు గన్ పట్టకుండా, యుద్ధం ఎలా చేస్తావు అని హీరోని అడుగుతారు. నేను గన్ పట్టేవాళ్ళు ప్రమాదంలో పడితే కాపాడతానని చెప్తాడు. హీరో ఒక డాక్టర్ కావడంతో, ప్రమాదంలో పడే సైనికుల్ని కాపాడతానని చెప్తాడు. హీరోని అప్పుడు అందరు తేలిగ్గా తీసుకుంటారు. కొంతమంది అతనిపై దాడి కూడా చేస్తారు. ఎందుకంటే హీరో మళ్లీ తిరిగి కొడతాడేమోనని చూస్తారు. అయితే హీరో మాత్రం చాలా శాంతంగా ఉంటాడు.

కొద్దిరోజులకి వీళ్లు కూడా యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ జపాన్ సైనికుల చేతిలో, అమెరికన్ సైనికులు చాలామంది పోరాడి కొన ఊపిరితో ఉంటారు. వాళ్లని హీరో తన ప్రాణాలకు తెగించి కాపాడుతూ ఉంటాడు. ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడ నుంచి హాస్పిటల్ కి పంపిస్తుంటాడు. ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోతారు. వందమందిని చంపడంతో వచ్చే ఆనందం కన్నా, ఒక వ్యక్తిని బ్రతికిస్తే వచ్చే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఈ ఫీలింగ్ తోనే అక్కడ గాయపడ్డ జపాన్ సైనికున్ని కూడా కాపాడుతాడు హీరో. తనని ఎగతాళి చేసిన పై అధికారిని కూడా ప్రాణాలకు తెగించి కాపాడుతాడు. చివరికి హీరో ఈ యుద్ధంలో ప్రాణాలతో బయటపడతాడా? హీరోని చూసి అక్కడ ఉన్న వాళ్ళు నేర్చుకున్నదేమిటి? హీరో గన్ పట్టుకోవడానికి ఎందుకు ఆలోచిస్తాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వార్ ఎంటర్టైనర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×