BigTV English

OTT Movie : ఆ జైలుకి వెళ్లిన వాళ్లు ప్రాణాలతో బయటపడరు… కేక పెట్టించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఆ జైలుకి వెళ్లిన వాళ్లు ప్రాణాలతో బయటపడరు… కేక పెట్టించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు ఓటిటి ప్లాట్ ఫామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాలను చూస్తున్నంత సేపు, వేరే ప్రపంచం గుర్తుకురాదు. మూవీ మొదటి నుంచి చివరిదాకా, అందులోనే లీనమైపోతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, హీరో చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవిస్తాడు. అయితే ఆ జైలు చాలా భయంకరంగా ఉంటుంది. అందులో నుంచి హీరో తప్పించుకునే క్రమంలో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

ఈ హాలీవుడ్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘హోల్స్‘ (Holes). ఈ మూవీకి ఆండ్రూ డేవిస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సిగౌర్నీ వీవర్, జోన్ వోయిట్, ప్యాట్రిసియా ఆర్క్వేట్, టిమ్ బ్లేక్ నెల్సన్, షియా లాబ్యూఫ్ నటించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా $71 మిలియన్లను ఆర్జించి, విమర్శకుల నుండి సానుకూల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

హీరో టీనేజ్ లో ఉండటంతో, సరదాగా ఫ్యామిలీతో గడుపుతూ ఉంటాడు. అయితే ఒక రోజు ఇతనికి దారి మధ్యలో ఒక జత షూ కనపడతాయి. వాటిని ఎత్తుకొని ఇంటికి వస్తాడు హీరో. ఆ షూ ఒక పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ కు చెందినవిగా, పోలీసులు గుర్తించి, హీరోని దొంగతనం కేసులో అరెస్ట్ చేస్తారు. తప్పు చేయకపోయినా, నేరం రుజువు కావడంతో ఇతనికి 16 నెలలు జైలు శిక్ష విధిస్తారు. తన కుటుంబానికి పెట్టిన శాపం వల్లే ఇదంతా జరుగుతోందని హీరో తాతకి అర్థమవుతుంది. హీరోని ఒక భయంకరమైన గ్రీన్ క్యాంప్ అనే జైలుకి తీసుకువెళ్తారు. పేరుకు మాత్రమే అది గ్రీన్ క్యాంప్, ఒక ఎడారి ప్రాంతంలో ఆ జైలు ఉంటుంది. అక్కడ ఉన్న ఖైదీలతో గుంతలు తవ్విస్తూ ఉంటారు. అందులో ఏదైనా దొరికితే, అధికారులకు ఇవ్వాలని ఆర్డర్ వేస్తారు. జైలుకు వెళ్లినాక హీరో తన తాత చెప్పిన కథను గుర్తు చేసుకుంటాడు. హీరో తాత వయసులో ఉన్నప్పుడు, ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెను పొందేందుకు? ఒక మహిళ సాయం తీసుకుంటాడు. అయితే ఆ మహిళ ఒక కొండ మీద ఉండే, మహిమగల నీళ్ల దగ్గరికి తనని తీసుకు వెళ్ళమని అడుగుతుంది. అలాగే నువ్వు ప్రేమించే అమ్మాయి పిచ్చిదని, అయినా పెళ్లి చేసుకుంటానంటే సాయం చేస్తానని చెప్తుంది.

ఈ క్రమంలో అతను ప్రేమించే అమ్మాయి నిజంగానే పిచ్చిదని తెలుసుకుంటాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా, అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఆ మహిళకి మహిమగల నీటి దగ్గరికి తీసుకువెళ్లడానికి సాయం చేస్తానని చెప్పి మాట తప్పుతాడు. అప్పుడు ఆ మహిళ మీ కుటుంబానికి అంతా చెడే జరుగుతుందని శాపం పెడుతుంది. అలా అప్పటినుంచి అతని జీవితంలో అన్నీ చెడే ఎక్కువగా జరుగుతాయి. ఈ క్రమంలో మనవడు కూడా జైలుకు వెళ్తాడు. ఇది గుర్తు చేసుకుంటూ, ఆ ప్రాంతం నుంచి తప్పించుకోవాలనుకుంటాడు హీరో. అయితే అతనితోపాటు మరొక వ్యక్తితో ఆ ప్రాంతం నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. చివరికి హీరో ఆ ప్రాంతం నుంచి బయట పడతాడా? హీరోకి ఆ మంత్రగత్తే పెట్టిన శాపం వల్లే, అతడు జైలుకు వెళ్లాడా? ఆ ప్రాంతంలో ఖైదీలతో గుంతలు ఎందుకు తవ్విస్తున్నారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో, స్ట్రీమింగ్ అవుతున్న ఈ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×