Nithiin: వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ఇప్పటికే ‘భీష్మ’ అనే మూవీలో నటించాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘రాబిన్‌హుడ్’ అనే మరో మూవీ రానుంది. గతేడాది డిసెంబర్‌లోనే ఈ సినిమా విడుదల కావాల్సింది. అలాంటిది ఇన్నాళ్ల పాటు ఇది పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఫైనల్‌గా మార్చి 28న ‘రాబిన్‌హుడ్’ మూవీ రిలీజ్ ఖరారు చేసుకుంది. ఇందులో నితిన్‌కు జోడీగా శ్రీలీల నటించగా మరొక ముఖ్య పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కనిపించనున్నారు. ఇక తాజాగా ఈ సినిమా విశేషాలు పంచుకోవడానికి మేకర్స్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా అందులో నితిన్, రాజేంద్ర ప్రసాద్.. ‘రాబిన్‌హుడ్’ హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
క్లీన్ కామెడీ
‘‘నిన్న రాత్రి నేను, వెంకీ కుడుముల కలిసి రాబిన్‌హుడ్ సినిమా మొత్తం చూశాం. చూసిన తర్వాత గంటసేపు ప్రేమించుకొని, కౌగిలించుకొని, దాదాపుగా కామించుకోబోయాం. బ్లాక్‌బస్టర్, అదిరిపోతుంది అనే మాటలు నేను మాట్లాడను. ఈ సినిమా 28న విడుదల అవుతుంది. 30న నా పుట్టినరోజు ఉంది. ఈ సినిమా సక్సెస్‌తోనే నా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటాను. ఇది చాలా క్లీన్ కామెడీ. ఇందులో ఒక్క అసభ్యకరమైన మాట ఉండదు. నాతో పాటు మరొక హీరో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కూడా. ఈసారి ఇది ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాదు.. ఇది వెంకీ కుడుముల విశ్వరూపం. తెలివైన వాళ్లకు కూడా ఈ సినిమా నచ్చుతుంది’’ అని చాలా నమ్మకంతో చెప్పాడు నితిన్.
హిట్ పెయిర్ అనిపించుకుంటాం
‘‘శ్రీలీలకు, నాకు చివరి సినిమా ఒకటే. అది గతేడాది డిసెంబర్‌లో విడుదలయ్యింది. చివరి సినిమాతో మాపై ఫ్లాప్ పెయిర్ అనే ముద్ర వచ్చింది. ఈ మూవీతో అది చెరిగిపోయి హిట్ పెయిర్ అనిపించుకుంటాం’’ అంటూ ‘రాబిన్‌హుడ్’ను అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పాడు నితిన్. తను మాత్రమే కాదు.. రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు. ముందుగా తాను హీరోగా నటించిన రోజులను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఎంత క్లీన్ కామెడీ ఉండేదో.. అలాంటి కామెడీ ఈ సినిమాలో ఉంటుందని అన్నారు. నటుడిగా చాలాకాలం తర్వాత ‘రాబిన్‌హుడ్’లో తను చేసిన పాత్ర చాలా తృప్తినిచ్చిందని తెలిపారు.
Also Read: మొహాలు తెలియని సౌత్ హీరోల సినిమాలు చూస్తున్నారు.. బాలీవుడ్ రైటర్ ఆవేదన
అయిదు జెనరేషన్స్‌తో పనిచేశాను
ఇప్పటివరకు తాను 5 జెనరేషన్స్ హీరోలతో నటించానని గుర్తుచేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్. ఇప్పటికీ ఆయన సినీ రంగంలో వెలిగిపోతున్నారంటే దానికి ‘రాబిన్‌హుడ్’లో చేసిన పాత్రలే అని తెలిపారు. వెంకీ కుడుముల సినిమా బాగా తెరకెక్కించారని ప్రశంసించారు. శ్రీలీల కూడా ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్పుకొచ్చింది. శ్రీలీల అంటే ఎప్పుడూ డ్యాన్స్ మాత్రమే కాదని, ఇందులో డైలాగ్స్, పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందని తెలిపింది. ఇక చిన్నప్పుడు తన అమ్మ పర్సులో నుండి లిప్ స్టిక్స్, మేకప్ కొట్టేసిన రోజులను గుర్తుచేసుకుంటూ అందరినీ నవ్వించింది శ్రీలీల. మొత్తానికి ‘రాబిన్‌హుడ్’లో రాజేంద్ర ప్రసాద్ పాత్రను ఇప్పటికే సర్‌ప్రైజ్‌లాగానే ఉంచారు మేకర్స్.