BigTV English

Shobhitha dhulipala Bold: అక్కినేని వారి కోడలు అంత బోల్డ్ గా రెచ్చిపోయిందేమిటి?

Shobhitha dhulipala Bold: అక్కినేని వారి కోడలు అంత బోల్డ్ గా రెచ్చిపోయిందేమిటి?

Sobhitha dhulipala in bold web series(Tollywood celebrity news): ఏ క్షణాన నాగచైతన్యతో ఎంగేజ్ మెంట్ జరిగిందో శోభిత దూళిపాళ కోసం నెటిజన్స్ సెర్చింగ్స్ మొదలుపెట్టేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అంటే ఇదేనంటున్నారు అంతా. శోభిత అచ్చ తెలుగు పిల్ల అని చాలా మందికి తెలియదు. తెనాలి లో పుట్టి పెరిగింది. ఇంటర్ వరకూ ఆంధ్రాలోనే చదివిన శోభిత పై చదువుల కోసం ముంబాయి వెళ్లింది. ఆమె అందం చూసి ఫ్రెండ్స్ అంతా పొగడ్తలతో ముంచెత్తేవారు. వారి ప్రోత్సాహంతోనే ఆమె మిస్ ఇండియా పోటీలలోనూ పాల్గొంది. అయితే 2013లో జరిగిన మిస్ ఇండియా పోటీలో మిస్ ఇండియా ఎర్త్ దక్కించుకుంది. సాధారణంగా మిస్ ఇండియా లకు బాలీవుడ్ ఛాన్సులు చాలా ఈజీగా దక్కుతాయి. అలాగే పలు కమర్షియల్ యాడ్స్ ఈమెను మోడల్ గా ఎంపిక చేసుకున్నాయి.


మోడల్ గా సక్సెస్

మోడలింగ్ లో సత్తా చాటిన శోభితకు వెంటనే సినిమా అవకాశాలు తలుపు తట్టలేదు. అయితే బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈమెకు రమణ్ రాఘవ 2.0 లో ఛాన్స్ ఇచ్చారు. అది కూడా ఆమె కమర్షియల్ యాడ్స్ చూసి ఎంపిక చేశారట. అప్పటికే తనకు సినిమా ఛాన్స్ ఎవరైనా ఇస్తారేమో అని చాలా మంది నిర్మాతలను సంప్రదించిన శోభితకు బాలీవుడ్ అవకాశాలు అంతంత మాత్రంగానే వచ్చాయి. తెలుగులో మాత్రం శోభిత అడవి శేష్ హీరోగా గూఢచారి మూవీలో నటించింది. చాలా సందర్భాలలో తనకి ఇష్టమైన సినిమా గూఢచారి అని చెబుతుంటారు శోభిత.


హాలీవుడ్ మూవీ ఛాన్స్

తెలుగు, మలయాళ, తమిళ చిత్రాలతో సహా హాలీవుడ్ లోనూ నటించింది ఈ బ్యూటీ. మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ మూవీలో నటించింది శోభిత. ఇంకా పలు వెబ్ సిరీస్ లలోనూ నటించింది. ట్రెడిషనల్ డ్యాన్స్ కూడా బాగా చెయ్యగలదు. కూచిపూడి, భరత నాట్యంతో సహా గిటార్ కూడా వాయించగలదు. ప్యూర్ వెజిటేరియన్ తానని చెబుతోంది శోభిత. అయితే నాగచైతన్యతో పరిచయం ప్రేమగా మారి రీసెంట్ గా ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. దీనితో శోభిత నటించిన వెబ్ సిరీస్ ను నెటిజెన్స్ తెగ వెదికేస్తున్నారు. ఇప్పుడు వాటి తాలూకు బోల్డ్ ఫొటోలు వైరల్ గా మారాయి. శోభితకు సంబంధించి ఆమె బోల్డ్ గా నటించిన రెండు వెబ్ సిరీస్ గురించి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. అందులో ఒకటి మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ విడుదలైనప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఈ మూవీని డౌన్ లోడ్ చేసుకుని తెగ చూసేస్తున్నారు. అప్పట్లో ఇది ఓటీటీలో రిలీజయింది.

మేడ్ ఇన్ హెవెన్

మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ లో శోభిత కు సంబంధించిన బోల్డ్ సీన్స్, ఇమేజెస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాతో బాటు ది నైట్ మేనేజర్ అనే బోల్డ్ వెబ్ సిరీస్ ను కూడా నెటిజన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇందులో శోభిత ఓగ్యాంగ్ స్టర్ కి భార్యగా నటించింది. ఇందులో కూడా హాట్ హాట్ సన్నివేశాలు ఉన్నాయి. మామూలుగా అయితే అంతగా డిమాండ్ లేని ఈ సినిమాలకు ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చిపెట్టింది అక్కినేని వారి కోడలు. కేవలం ఎంగేజ్ మెంట్ అయిన కారణంతోనే శోభిత పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది.

 

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×