Muhammad Yunus latest news(Today international news headlines): బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో అక్కడ మైనార్టీగా ఉన్న హిందువులపై దాడులు జరిగాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ హిందూ మత పెద్దలతో సమావేశమయ్యారు. దయచేసి సహకరించాలని, త్వరలో అన్ని సమస్యలు చక్కబడతాయని చెప్పు కొచ్చారు.
బంగ్లాదేశ్ రిజర్వేషన్ల అల్లర్ల నేపథ్యంలో ఆ దేశం అట్టుడికింది. పలు ప్రాంతాల్లో షాపులు లూటీలు జరిగాయి. కొన్ని పరిశ్రమలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. హిందువులకు సంబంధించిన 270కి పైగా దేవాలయాలు, షాపులపై నాయకులపై దాడులు జరిగాయి. ఈ క్రమంలో అక్కడ మైనార్టీగా హిందువులు ఆందోళనకు దిగారు. పరిస్థితి గమనించిన బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ రంగంలోకి దిగేశారు.
మంగళవారం రాజధాని ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించింది మహమ్మద్ యూనస్ టీమ్. శక్తి పీఠాల్లో ఇది కూడా ఒకటిగా చెబుతారు. అక్కడి హిందూ మత పెద్దలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారాయన. ఇక్కడ ప్రజలందరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు. మన మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదన్నారు. దయచేసి సహకరించాలని, దాడులకు కారణమైన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ALSO READ: ఇజ్రాయిల్ Vs హమాస్.. ఇజ్రాయిల్‌పై హమాస్ రాకెట్ దాడి
గత పాలకుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు మహమ్మద్ యూనస్. ఒక రాక్షసి వెళ్లిపోయిందంటూ మాజీ పీఎం షేక్ హసీనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆలయాలు, చర్చలపై దాడుల గురించి తెలిస్తే సమాచారం తెలపాలంటూ హాట్‌లైన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతేకాదు ఢాకాలో భారత వీసా దరఖాస్తుల కేంద్రం కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయి.