E-Paper
Advertisement

Niharika Konidela: బాబాయ్ కోసం అమ్మాయ్ తనవంతు ప్రచారం.. ఇదుగో ఇలా

Niharika Konidela: బాబాయ్ కోసం అమ్మాయ్ తనవంతు ప్రచారం.. ఇదుగో ఇలా
Advertisement

Niharika Konidela: జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం తమవంతు కృషి చేస్తున్నారు. కొందరు డైరెక్ట్ గా ప్రచారాలు చేస్తుంటే.. ఇంకొందరు తమ సినిమాల ద్వారా గాజు గ్లాస్ కు ఓటు వేయమని హింట్ ఇస్తున్నారు. మొన్నటికి మొన్న పుష్ప 2 సాంగ్ లో అల్లు అర్జున్ టీ గ్లాస్ స్టెప్ తో జనసేనకు మద్దతు తెలుపుతున్నట్లు హింట్ ఇచ్చాడు. ఇక మెగా హీరోలు అయిన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే ప్రచారంలో పాల్గొన్నారు.

ఇంకోపక్క చిరంజీవి, నాగబాబు సైతం తమ వీడియోలతో అభిమానుల్లో జనసేనపి పాజిటివిటీ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మెగా డాటర్ కూడా రంగంలోకి దిగింది. నిహారిక కొణిదెల.. పవన్ బాబాయ్ కోసం ఇన్ డైరెక్ట్ గా తన సినిమా ద్వారా మంచి నాయకుడును ఎన్నుకోవాలని సందేశం ఇచ్చింది. అది ఎలా అంటారా.. నిహారిక ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై ఆమె నిర్మిస్తున్న చిత్రం కమిటీ కుర్రాళ్ళు.

Advertisement

కొత్త వాళ్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యాదు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు ఈ సినిమాలోని మొదటి పాటను నిహారిక.. లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ చేత లాంచ్ చేయించింది. గొర్రెలా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఎలక్షన్స్ సమయంలో ప్రజలు ఎలా ఉంటారు.. నాయకులు ఏం చెప్తారు.. ? డబ్బులు, చీరలకు ఆశపడి ఓటును అమ్మేసుకుంటున్నారు.. వీళ్లు మనుషులు కాదు గొర్రెలు అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఎలక్షన్స్ సమయంలో ఈ సాంగ్ బాగా పోతుందని తెలుస్తోంది.

ఇక మంచి చేసే నాయకుడును ఎంచుకోవాలని సాంగ్ లో చెప్పుకొచ్చారు. ఇక దీంతో నిహారిక.. కావాలనే ఈ సాంగ్ ను ఇప్పుడు రిలీజ్ చేయించిందని తెలుస్తోంది. పవన్ బాబాయ్ ను గెలిపించడానికి ప్రచారానికి రాకుండా ఇలా తన సినిమా ద్వారా ఎలక్షన్స్ సాంగ్ రిలీజ్ చేసి సపోర్ట్ చేసిందని నెటిజన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో నిహారిక నిర్మాతగా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×