E-Paper
Advertisement

Niharika Konidela: క్లింకార లక్ లో నిహారిక అత్త కూడా చేరిందిరోయ్..

Niharika Konidela: క్లింకార లక్ లో నిహారిక అత్త కూడా చేరిందిరోయ్..
Advertisement

Niharika Konidela: మెగా ఇంట అదృష్ట దేవత పుట్టింది. ఏ ముహూర్తాన ఉపాసన.. క్లింకారకు జన్మనిచ్చిందో కానీ, ఆ క్షణం నుంచి మెగా ఇంట విజయాలే విజయాలు. ఆమె పుట్టిన వెంటనే.. వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి జరిగింది. ఆ తరువాత చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చింది. ఇక పదేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మారారు. ఒకటి అని చెప్పలేం.. వరుసగా మెగా ఇంట అన్ని మంచి శకునములే అనే విధంగా మారిపోయింది. ఇక క్లింకార లక్ లిస్ట్ లో నిహారిక కూడా చేరిపోయింది.

నాగబాబు కూతురు నిహారిక.. విడాకుల తరువాత నటిగా కొనసాగుతున్న విషయంతెల్సిందే. ఒకపక్క నటిగా కొనసాగుతూనే ఇంకోపక్క నిర్మాతగా మారింది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ ను నిర్మించి అందులో వెబ్ సిరీస్ లు చేస్తూ వచ్చింది. ఇక మొట్ట మొదటిసారి ఆమె తన బ్యానర్ లో ఒక సినిమాను నిర్మించింది. అదే కమిటీ కుర్రోళ్లు.

Advertisement

యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంతా 11 మంది హీరోలు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, సాయి కుమార్, గోపరాజు రమణ,రమణ భార్గవ్, త్రినాథ్ వర్మ, టీనా శ్రావ్య, ప్రసాద్ బెహరా, రాధ్య సురేష్, తేజస్వి రావు తదితరులు నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను అందుకుంటుంది. చిన్ననాటి స్నేహితుల మధ్య గొడవలు, ఊర్లో ఉండే రాజకీయాలు.. ఇలా సినిమా మొత్తాన్ని కామెడీతో పాటు సెంటిమెంట్ తో కూడా నింపేశారు. నిజంగా ఇలాంటి ఒక కథను నిహారిక నమ్మి డబ్బు పెట్టి మంచి పని చేసిందనే చెప్పాలి. నటిగా మొదటి సినిమాతో హిట్ అందుకోలేకపోయినా.. నిర్మాతగా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

Advertisement

ఇక ఈ లక్ మొత్తం క్లింకార అకౌంట్ లో పడిపోయింది. బుజ్జిదాని మీద అంత ప్రెషర్ పెట్టడం కరెక్ట్ కాకపోయినా.. ఆమె వచ్చాకనే మెగా ఫ్యామిలీకి కలిసి వచ్చింది అని చెప్పడంలో మాత్రం ఎలాంటి ఆతిశయోక్తి లేదని చెప్పొచ్చు. నిహారిక కూడా క్లింకార లక్ లో చేరిపోవడం ఆనందించదగ్గ విషయమే. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్ కలక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×