E-Paper
Advertisement

Jathara Movie: ‘జాతర’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.. భారీగా అంచనాలను పెంచిన డైలాగ్

Jathara Movie: ‘జాతర’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.. భారీగా అంచనాలను పెంచిన డైలాగ్
Advertisement

Jathara Movie: స్పెషల్ కంటెంట్‌తో కొత్త డైరెక్టర్లు టాలీవుడ్‌లో హైలెట్‌ను క్రియేట్ చేస్తున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టుగా చిత్రాలు తీస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. అంతేకాదు.. పలువురు డైరెక్టర్లు దర్శకత్వంతోపాటు హీరో రోల్‌ను కూడా వారే పోషిస్తున్నారు. సతీష్ బాబు కూడా ఇప్పుడు ఇలాంటి ఓ రొటీన్ కాన్సెప్ట్‌తో రూపొందించిన ‘జాతర’ మూవీతో డబుల్ రోల్ ప్లే చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమాలో సతీష్ బాబు.. హీరోగా నటించడమే కాదు.. ఈ సినిమాకు కథ, కథనాన్ని అందించి దర్శకత్వం కూడా అతనే వహిస్తున్నాడు. గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీ టెక్ ఎల్ఎల్‌సీతో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Advertisement

కాగా, ఈ పోస్టర్‌ను ఓసారి గమనిస్తే.. హీరో సతీష్ బాబు ఈ మూవీలో ఎంత రా అండ్ రస్టిక్‌గా కనిపించబోతున్నారో ఇట్టే అర్థమవుతుంది. శత్రువులను వదించేందుకు కత్తి పట్టుకుని సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇక అమ్మవారి ఫొటో, జాతరలో పూనకాలు వచ్చినట్టుగా లుక్, గెటప్ అన్నీ కూడా అదుర్స్‌గా ఉన్నాయి. ఇదిలా ఉంటే ‘దేవుడు ఆడే జగన్నాటకంలో ఆ దేవునితో మనిషి ఆడింటే పితలాటకం’ అంటూ పోస్టర్ మీద రాసి ఉన్న డైలాగ్ సినిమాపై మరింతగా అంచనాలను పెంచింది.

Also Read: ఒక స్టార్ హీరో అయ్యి ఉండి కూడా ఇప్పటివరకు ఆ పని చేయని ఏకైక హీరో

Advertisement

ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగే జాతర నేపథ్యంతో ఈ మూవీ కొనసాగుతుంది. పాలేటి గంగమ్మ దేవత బ్యాక్ డ్రాప్‌గా కథను రాశారు. ఈ సినిమాలో దీయా రాజ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆర్.కె. పిన్నపాల, గోపాల్ రెడ్డి, సాయి విక్రాంత్ సహాయక పాత్రల్లో నటించారు. కెవీ ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీజిత్ ఎడవణ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×