E-Paper
Advertisement

Robinhood Teaser: రాబిన్ హుడ్.. వాడికి పర్టిక్యులర్ జెండా, ఎజెండా ఏది ఉండదు

Robinhood Teaser: రాబిన్ హుడ్.. వాడికి పర్టిక్యులర్ జెండా, ఎజెండా ఏది ఉండదు
Advertisement

Robinhood Teaser: యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న  చిత్రం రాబిన్ హుడ్.  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణం.. నితిన్ – వెంకీ   కాంబోలో ఇప్పటికే భీష్మ లాంటి హిట్ సినిమా వచ్చింది. దీంతో ఈ సినిమా కూడా ఆ రేంజ్ కామెడీని అందిస్తారని  ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా రాబిన్ హుడ్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ” ఆగని హైఫై ఇళ్లలో చోరీలు.. ఇంతమంది దాచుకున్న  హనీని  దోచుకుంటున్న ఆ హనీ సింగ్ ఎవరు..? ” అంటూ న్యూస్ యాంకర్ వాయిస్ తో టీజర్ మొదలయ్యింది. రాబిన్ హుడ్ నే ఈ దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Advertisement

Unstoppable With NBK: ఎప్పుడు నాది ఒకటే మాట.. ఆయన బంగారం.. అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు

రాబిన్ హుడ్.. వాడికి పర్టిక్యులర్ జెండా, ఎజెండా ఏది ఉండదు.. డబ్బు కోసం ఎవరికైనా ఎదురు వెళ్తాడు అని చెప్పుకొచ్చి.. ఎలివేషన్ ఇచ్చారు. ఇక ఇంకోపక్క వింత వింత గెటప్స్ లో నితిన్ కనిపించాడు. మధ్యలో శ్రీలీల ఎంట్రీ.. ఆమె ఒక రిచ్ గర్ల్ గా కనిపిస్తుంది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడిన రాబిన్ హుడ్ ఆ తరువాత ఒక సమస్యలో ఇరుక్కున్నట్లు చూపించారు.

Advertisement

ఇక నితిన్ ఎదుర్కోబోయే విలన్ ను మాత్రం చూపించకుండా మంచి హైప్ క్రియేట్ చేశారు. అసలు ఆ హనీ సింగ్ ఎవరు..? రాబిన్ హుడ్ ఎందుకు ఈ దొంగతనాలు  చేస్తున్నాడు..? శ్రీలీల కోసం నితిన్ చేసిన రిస్క్ ఏంటి .. ? అనేది సినిమాలో  చూడాల్సిందే. నితిన్ కు ఇలాంటి పాత్రలు కొత్తేమి కాదు. లై, ఛల్ మోహన్ రంగా సినిమాలు కూడా ఇంచుమించు ఇలానే  ఉంటాయి.

Siva Karthikeyan: భార్యను సర్ ప్రైజ్ చేసిన హీరో.. వీడియో వైరల్

ఇక కామెడీ పరంగా రాబిన్ హుడ్ ను నమ్మొచ్చని తెలుస్తోంది. రాజేంద్ర ప్రసాద్ , వెన్నెల కిషోర్, నితిన్ కామెడీ ట్రాక్ హైలైట్ గా నిలుస్తుందని  చెప్పొచ్చు. ఇక ఈ సినిమా డిసెంబర్  25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×