BigTV English

BB Telugu 8 Promo: పృథ్వీకి సర్ప్రైజ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తల్లి..!

BB Telugu 8 Promo: పృథ్వీకి సర్ప్రైజ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తల్లి..!

BB Telugu 8 Promo : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్.. ఇప్పుడు ఎనిమిదవ సీజన్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం 11వ వారంలో భాగంగా ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. అందులో భాగంగానే కంటెస్టెంట్స్ కి సంబంధించిన బంధువులు హౌస్ లోకి అడుగుపెడుతూ వారికి ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఇక ఇప్పటివరకు నబీల్ తల్లి హౌస్ లోకి అడుగుపెట్టగా, అలాగే విష్ణు ప్రియ తండ్రి హౌస్ లోకి వచ్చి అతిపెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. బంధాలు తెగిపోయాయి అనుకునే సమయంలో సడన్ గా ఆమె తండ్రి హౌస్ లోకి వచ్చి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పవచ్చు. అంతే కాదు యష్మీ తండ్రి కూడా హౌస్ లోకి అడుగుపెట్టి ,తన బిడ్డ ఏదైనా తప్పు చేస్తే క్షమించమని కోరి అందరి మనసులు గెలుచుకున్నారు.


ఇక ఇలా ఒక్కొక్క కంటెస్టెంట్ కి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరో ఒకరు హౌస్ లోకి వచ్చి వారిని సంతోష పరుస్తుంటే.. తాజాగా పృథ్వీ తల్లి కూడా హౌస్ లోకి అడుగుపెట్టింది. పృథ్వీ తల్లి హౌస్ లోకి అడుగుపెట్టిందో లేదో.. పృథ్వీ ఒక్కసారిగా తన తల్లిని వెళ్లి హగ్ చేసుకున్నాడు. ఇక తర్వాత విష్ణు ప్రియ పృథ్వీ తల్లి సత్యభామ ఆశీర్వాదాలు తీసుకుంది. తర్వాత హౌస్ లో నీకు ఎవరంటే ఇష్టం అమ్మ ఇక్కడ అని పృథ్వి అడగగా.. దానికి సత్యభామ విష్ణు ప్రియా అంటే ఇష్టం అంటూ చెప్పి వారి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. మొత్తానికి అయితే విష్ణుప్రియ అంటే ఇష్టం అని చెప్పడం తో.. కోడలిగా రావాలని కోరుకుంటోందా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే పృథ్వీ హౌస్ లోకి వచ్చి కొడుకు ఆలనా పాలన చూసుకుంటూ ఉంటే.. టేస్టీ తేజ ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా ఏడ్చేసారు. అందరి తల్లిదండ్రులు హౌస్ లోకి వస్తున్నారు.. మా అమ్మను కూడా హౌస్ లోకి తీసుకురండి బిగ్ బాస్.. ప్లీస్ అంటూ బోరున ఏడ్చేశారు. టేస్టీ తేజ కన్నీళ్లు చూస్తే ఎవరైనా సరే కంటతడి పెట్టుకోవాల్సిందే. ఇక కామెంట్ సెక్షన్ మొత్తం టేస్టీ తేజ తల్లిని తీసుకురావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉండడం గమనార్హం. వాస్తవానికి తన తల్లిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావడం కోసమే టేస్టీ తేజ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు. అయితే సరిగ్గా ఫ్యామిలీ వీక్ టేస్టీ తేజకు బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చాడు. దీనికి తోడు గౌతమ్, రోహిణి కూడా టేస్టీ తేజ కోసం తమ ఫ్యామిలీ వీక్ ను త్యాగం చేశారు. మరి చివర్లోనైనా టేస్టీ తేజ తల్లిని తీసుకొస్తారో లేదో తెలియదు కానీ తన తల్లి కోసం తహతహలాడుతూ కన్నీటి పర్యంతం అవుతున్నారు టేస్టీ తేజ.


గౌతమ్ అన్నయ్య కూడా హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇక్కడ ట్రయాంగిల్ లేదు.. ఏమీ లేదు.. చక్కగా ఆట ఆడు.. ఏది కూడా వదిలిపెట్టకు.. కప్పు గెలుచుకొని రా అన్నట్టుగా తమ్ముడికి సలహాలు ఇచ్చారు. ఆ తర్వాత సత్యభామతో పాటు గౌతమ్ అన్నయ్యతో కూడా ఆటలు ఆడించారు బిగ్ బాస్. మొత్తానికి అయితే ఈ ప్రోమో అటు ఫన్నీగా , ఇటు ఎమోషనల్ గా సాగింది.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×