Siva Karthikeyan: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు.తెలుగులో సెల్ఫ్ మేడ్ స్టార్స్ అంటే చిరంజీవి, రవితేజ, విజయ్ దేవరకొండ అని ఎలా అయితే చెప్పుకొస్తామో.. తమిళ్ లో శివకార్తికేయన్ ఒక సెల్ఫ్ మేడ్ స్టార్. యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించి, చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా మారాడు. డిఫరెంట్ కథలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక రెమో అనే సినిమా శివకార్తికేయన్ లైఫ్ ను టర్న్ అయ్యేలా చేసింది. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ ను అందుకుంది. అమ్మాయి వేషంలో శివకార్తికేయన్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అప్పటినుంచి ఈ కుర్రహీరో సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఇక వరుణ్ డాక్టర్, డాన్, ప్రిన్స్.. ఇలా తెలుగులో ఆయన నటించిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజగా శివకార్తికేయన్ నటించిన అమరన్ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే.
RC16 : ఏందయ్యా బుచ్చిబాబు నీ ప్లానింగ్..అన్ని ఇండస్ట్రీలను వాడేస్తున్నావే ..?
రాజ్ కుమార్ పెరిసామి దర్శకత్వం వహించిన ఈ సినిమా దీపావళీ కానుకగా అక్టోబర్ 31 న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాశ్మీర్ నేపథ్యంలో శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత సంఘటనలతో రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ’ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
మేజర్ ముకుంద్ గా శివకార్తీకేయన్ కనిపించగా.. ఆయన భార్య ఇందు పాత్రలో సాయిపల్లవి కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లో ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. తాజాగా శివకార్తికేయన్ మేజర్ షూటింగ్ డైరీస్ ను అభిమానులతో పంచుకున్నాడు. మొదటిసారి మేజర్ గెటప్ లో ఇంటికి వెళ్లి.. భార్యను సర్ ప్రైజ్ చేశాడు.
Akshara Singh : హీరోయిన్ కు హత్యా బెదిరింపులు… 50 లక్షలు డిమాండ్
వంటగదిలో పిల్లలకు క్యారేజ్ కడుతున్నఆర్తి వెనుక నుంచి వెళ్లి నిలబడ్డాడు. ఆమె శివకార్తికేయన్ ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆ తరువాత అతనిని హాగ్ చేసుకుంది. ఈ క్యూట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. లవ్లీ కపుల్.. ఇలాగే హ్యాపీగా ఉండాలి అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
ఇకపోతే శివకార్తికేయన్- ఆర్తికి 2010 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అమరన్ తరువాత ఈ హీరో.. రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ వరుస సినిమాలతో బిజీగా మారాడు.
Major Sivakarthikeyan 😍❤️#Amaran pic.twitter.com/by9gVIlcIz
— FafduMani (@_FafDuMani_) November 13, 2024