BigTV English

VNR Trio : నితిన్‌-ర‌ష్మిక మూవీ.. టైటిల్ చెప్పిన చిరంజీవి

VNR Trio : నితిన్‌-ర‌ష్మిక మూవీ.. టైటిల్ చెప్పిన చిరంజీవి
VNR Trio

VNR Trio : నితిన్, ర‌ష్మిక మంద‌న్న కాంబినేష‌న్‌లో కొత్త సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నారు. వీరి ముగ్గురు కాంబినేష‌న్‌లో సినిమా ఇది వ‌ర‌కే రూపొందిన సంగ‌తి తెలిసిందే. అదే భీష్మ‌. నితిన్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బ్లాక్ బ‌స్ట‌ర్ ఇది. త‌ర్వాత ఆ రేంజ్‌లో ఈ మ‌ధ్య కాలంలో నితిన్‌కు హిట్ లేదు. దీంతో ఆయ‌న మ‌ళ్లీ వెంకీ కుడుముల‌కే ఓటేశాడు. వెంకీ కుడుముల సైతం హీరోయిన్‌గా ర‌ష్మిక‌నే తీసుకున్నాడు. టాలీవుడ్‌లో త‌న‌కు ఛ‌లో, భీష్మ వంటి హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్ట‌ర్ అడిగితే అమ్మ‌డు కాద‌ని అంటుందా ఓకే చెప్పేసింది.


నితిన్‌, ర‌ష్మిక‌, వెంకీ కుడుముల త్ర‌యానికి సంబంధించిన మూవీ ప్రారంభోత్స‌వానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. హిట్ కాంబో సినిమాను VNRTrioగా మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఈవెంట్‌కి వ‌చ్చి క్లాప్ కొట్టిన చిరంజీవి వ‌ర్కింగ్ టైటిల్ చాలా బావుందని చెప్పిన ఆయ‌న దీన్నే టైటిల్‌గా పెట్టుకుంటే బావుంటుంద‌ని అన్నారు. అందుకు ఆయ‌న ఇచ్చిన ఎగ్జాంపుల్ RRR సినిమానే. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమాను ప్ర‌క‌టించిన‌ప్పుడు RRR అనే వ‌ర్కింగ్ టైటిల్‌గా అనౌన్స్ చేశారు. కానీ అంద‌రికీ ఆ పేరు రిజిష్ట‌ర్ అయిపోవ‌టంతో దాన్నే టైటిల్‌గా పెట్టేశారు రాజ‌మౌళి. ఇప్పుడు అలాగే VNRTrio బావుంద‌ని, కాబ‌ట్టి దాన్ని టైటిల్‌గా పెట్టుకోవ‌చ్చున‌ని స‌ల‌హా ఇచ్చారు. మ‌రి మెగా స‌ల‌హాను మైత్రీ మూవీ మేక‌ర్స్ పాటిస్తుందో లేదో చూడాలి మ‌రి.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు న‌టించ‌బోతున్నారు. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×